
క్షేత్రపాలకుడికి నాగవల్లి అర్చన
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ఆంజనేయస్వామికి ఇష్టమైన రోజు కావడంతో ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయాల్లో సిందూరం పాటు పాలతో మన్యసూక్త పారాయణములతో అభిషేకం నిర్వహించారు. సిఽందూరంతో అలంకరించిన ఆంజనేయస్వామిని సుగంధద్రవ్యాలు, పూలతో అలంకరించి, నాగవల్లి దళార్చన చేపట్టారు. ఇక ప్రధానాలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు విశేష పూజలను నిర్వహించారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం ఇవ్వండి
సాక్షి, యాదాద్రి : రానున్న శాసన సభ ఎన్నికల్లో బీజేపీకి అఽధికారం ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర నర్సయ్య గౌడ్ ప్రజలను కోరారు. మంగళవారం భువనగిరిలోని ఆ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ గౌడ్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదన్నారు. తెలంగాణకు స్వాతంత్య్రం లభించిన సెప్టెంబర్ 17 ప్రజలకు అతిపెద్ద పండుగ రోజు అన్నారు. కేంద్రమే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్‌లో బుధవారం నిర్వహిస్తుందన్నారు. సెప్టెంబర్ 17న మోదీ జన్మదినం నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు బీజేపీ సేవాపక్షం నిర్వహిస్తుందన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు పాశం భాస్కర్, నాయకులు పోతంశెట్టి రవీందర్, కర్నాటి ధనంజయ, పడమటి జగన్మోహన్ రెడ్డి, ఏలె చంద్రశేఖర్, గూడూరు నరోత్తంరెడ్డి, కొప్పుల యాదిరెడ్డి, చందా మహేందర్ గుప్తా, మేడి కోటేష్, తడిసిన మల్లారెడ్డి, మాయ దశరథ, విజయ భాస్కర్‌రెడ్డి, రత్నపురం బలరాం, ఆకుతోట రామకృష్ణ పాల్గొన్నారు.
అంగన్‌వాడీలకు
శిక్షణ ప్రారంభం
భువనగిరిటౌన్ : కేంద్ర ప్రభుత్వం అమలు చేయిస్తున్న పోషణ్ బీ, పడాయి బీ కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు జిల్లాలోని నాలుగు ప్రాజెక్టుల పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లకు మంగళవారం భువనగిరిలో శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. మయ్యాయి. ఈ నెల 19వ తేది వరకు కొనసాగనున్న ఈ శిక్షణ కార్యక్రమాన్ని భువనగిరి ప్రాజెక్టు పరిధిలో సీడీపీఓ శాగంటి శైలజ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అనంతరం టీచర్లకు పలు విషయాలపై మాస్టర్ ట్రైనర్లు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
18న భువనగిరిలో ‘జల్సా’
భువనగిరిటౌన్ : మిలాద్ ఉన్ నబిని పురస్కరించుకుని ఈ నెల 18న భువనగిరి పట్టణంలోని ఏఆర్ గార్గెన్‌లో ముస్లిం మహిళల కోసం జల్సా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జలీల్‌పుర మజీద్ కమిటీ ప్రతినిధులు తెలిపారు. మంగళవారం భువనగిరిలో మజీద్ కమిటీ ఆధ్వర్యంలో జల్సా పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ఖాజీమహల్లలో మధ్యాహ్నం 1 గంటకు నిర్వహించే జల్సా కార్యక్రమంలో మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర, ఆయన బోధించిన సూక్తులను మహిళలకు తెలియపర్చనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఎండి వలీబాబా, ఎండి సుజావుద్దీన్, అబ్దుల్ మతిన్, ఉస్మాన్ చౌదరి, అబ్దుల్ గఫార్ చౌదరి, రహీమ్, ఫసి మౌలానా షోయిబ్ ఉర్ రహమాన్ తదితరులు పాల్గొన్నారు.

క్షేత్రపాలకుడికి నాగవల్లి అర్చన

క్షేత్రపాలకుడికి నాగవల్లి అర్చన