పశువులను తరలిస్తున్న వాహనం పట్టివేత
మునగాల : మండల శివారులో జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున కోదాడ నుంచి హైదరాబాద్‌కు ఓ వాహనంలో పశువులను తరలిస్తుండగా మండల పోలీసులు తనిఖీలు నిర్వహించి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ నుంచి టీఎస్ 29 టీ 3458 నంబర్ గల అశోక్ లేలాండ్ వాహనంలో పది పశువులు (8ఆడ, రెండు మగ)ను హైదరాబాద్‌లోని కబేళాకు తరలిస్తుండగా తనిఖీలు చేపట్టి వాహానాన్ని స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. కాగా కోదాడ పట్టణానికి చెందిన వేముల అనిల్, వాహనం డ్రైవర్ షేక్ అసీఫ్, క్లీనర్ సయ్యద్‌బాబులపై కేసు నమోదు చేసి పట్టుబడిన పశువులను హైదరాబాద్‌లోని జియాగూడ గోశాలకు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.


