ఓటుకు వేళాయే | - | Sakshi
Sakshi News home page

ఓటుకు వేళాయే

Nov 26 2026 1:41 AM | Updated on Nov 26 2026 1:41 AM

న్యూస్‌రీల్‌

పట్టణాల్లో పోలింగ్‌

జిల్లాలోని నాలుగు మున్సిపాల్టీలు, తొలి దశలోని 80 పంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. గురువారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. మున్సిపాల్టీలకు 30న కౌంటింగ్‌ నిర్వహించనుండా.. పంచాయతీల్లో పోలింగ్‌ రోజునే ఫలితాలు వెలువడనున్నాయి. ఓటమి భయంతో కూటమి అభ్యర్థులు ఓటుకు నోటు, బహుమతులతో ఓటర్లకు ప్రలోభాలకు ఎరవేస్తున్నారు.

గురువారం శ్రీ 26 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

సాక్షి, భీమవరం: భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పట్టణాల్లో మొత్తం 188 వార్డులకు పది వార్డులు ఏకగ్రీవమవ్వగా 178 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 3,99,235 మంది ఓటర్లకు 443 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు.

● భీమవరంలో చైర్‌పర్సన్‌ పదవికి నలుగురు పోటీలో ఉండగా 48 వార్డులకు వైఎస్సార్‌సీపీ 48 వార్డులకు రాజకీయ పక్షాలు, స్వతంత్రులు మొత్తం 146 మంది పోటీలో ఉన్నారు. అన్ని వార్డుల్లో వైఎస్సార్‌సీపీ పోటీలో ఉంది. కూటమి నుంచి నాలుగు చోట్ల బీజేపీ, 21 జనసేన, 23 టీడీపీ పోటీ చేస్తున్నాయి.

● పాలకొల్లులో చైర్‌పర్సన్‌కు 14 మంది, 43 వార్డులకు 116 మంది పోటీలో ఉన్నారు. వైఎస్సార్‌సీపీ అన్ని వార్డుల్లో పోటీలో ఉంది. కూటమిలో టీడీపీ 33, జనసేన ఏడు, బీజేపీ మూడు వార్డుల్లో పోటీ చేస్తున్నాయి.

● తణుకులో చైర్మన్‌కు ఐదుగురు, 42 వార్డులకు 107 మంది పోటీలో ఉన్నారు. వైఎస్సార్‌సీపీ అన్ని వార్డుల్లో పోటీలో ఉండగా కూటమి నుంచి టీడీపీ 29, జనసేన తొమ్మిది, బీజేపీ నాలుగు వార్డులు పంచుకున్నాయి.

● తాడేపల్లిగూడెంలో చైర్మన్‌కు ఏడుగురు, 45 వార్డులకు 116 మంది పోటీ చేస్తున్నారు. 43 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ, రెండు వార్డుల్లో సీపీఎం పొత్తుగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. కూటమి నుంచి టీడీపీ 22, జనసేన 19, బీజేపీ నాలుగు వార్డుల్లో పోటీలో ఉన్నాయి.

పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బంది

ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశా రు. బుధవారం సాయంత్రం పోలింగ్‌ సామగ్రితో ఎన్నికల సిబ్బంది కేంద్రాలకు చేరుకున్నారు. భీమవరంలో 952 మంది, తణుకులో 528, తాడేపల్లిగూడెంలో 660, పాలకొల్లులో 528 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.

పంచాయతీలు షురూ

నరసాపురం డివిజన్‌లోని ఐదు మండలాల్లో 90 పంచాయతీలకు 10 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 80 పంచాయతీలు, వాటి పరిధిలోని 623 వార్డుల్లో 2,77,894 మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వీరికోసం 959 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. 3,337 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. 10 మంది జోనల్‌ ఆఫీసర్లు, 35 మంది రూట్‌ ఆఫీసర్లు, 84 మంది మైక్రో అబ్జర్వర్లుతో పాటు వెబ్‌కాస్టింగ్‌ కోసం విద్యార్థుల సేవలను వినియోగిస్తున్నారు. 15 అత్యంత సమస్యాత్మక, 81 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్‌ అనంతరం ఓట్లు లెక్కింపు చేసి ఫలితాలను వెల్లడించనున్నారు.

పోలింగ్‌కు సర్వం సిద్ధం

జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీలతో పాటు నాలుగు మున్సిపాలిటీల్లో పోలింగ్‌ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఇన్‌చార్జి కలెక్టర్‌ కేఆర్‌ కల్పశ్రీ తెలిపారు. భీమవరం మున్సిపాల్టీలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఇన్‌చార్జి కలెక్టర్‌ పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలింగ్‌ ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

రూ.కోట్లు కుమ్మరించిన కూటమి

ఇటీవల జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి అనుకూల, కూటమికి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఇటు మున్సిపాల్టీల్లోను వైఎస్సార్‌సీపీ నుంచి కూటమికి గట్టి పోటీ ఎదురవుతోంది. వార్డుల పంపకాల్లో మిత్రపక్షాల మధ్య విభేదాలకు తోడు రెబల్స్‌ బెడద కూటమిని కంగారెత్తిస్తోంది. ఓటమి భయంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు నాలుగు మున్సిపాల్టీల్లో ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేలకు పైనే పంపకాలు చేశారు. కొన్ని వార్డుల్లో చీరలు, కుక్కర్లు, గ్లాసుల సెట్లు తదితర రూపాల్లో కానుకలు అందజేస్తున్నారు. గెలిచాక బహుమతులు ఇస్తామంటూ గిఫ్ట్‌ కూపన్లు ఇస్తున్నారు. నాలుగు మున్సిపాల్టీల్లో ప్రలోభాల కోసం కూటమి రూ.60 కోట్లకు పైనే కుమ్మరించినట్టు అంచనా. పంచాయతీల్లో సైతం కూటమి బలపర్చిన అభ్యర్థులు రూ.500 నుంచి రూ.1,000 వరకు పంపకాలతో పాటు చీరలు, ఇతర బహుమతులు ఇస్తున్నారు.

నేడు మలి విడత మున్సిపాల్టీలు, తొలి విడత పంచాయతీల్లో పోలింగ్‌

నాలుగు పట్టణాల్లో 3.99 లక్షల మంది ఓటర్లు

80 పంచాయతీల్లో 2,77,894 మంది ఓటర్లు

ఓటమి భయంలో కూటమి అభ్యర్థులు

ఓటుకు నోటు, బహుమతులు, గిఫ్ట్‌ కూపన్లతో ప్రలోభాల ఎర

పట్టణం పోలింగ్‌ కేంద్రాలు ఓటర్లు మహిళలు పురుషులు ఇతరులు

భీమవరం 157 1,45,737 75,841 69,848 48

తాడేపల్లిగూడెం 110 1,00,728 52,288 48,432 8

తణుకు 88 75,292 39,152 36,137 3

పాలకొల్లు 88 77,478 40,279 37,191 8

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement