భీమవరం (ప్రకాశంచౌక్): పంచారామక్షేత్రం భీమవరం గునుపూడిలోని ఉమా సోమేశ్వర జనార్దన స్వామివార్ల దేవస్థానంలో కార్తీక బహుళ పాడ్యమి సందర్భంగా బుధవారం మహాన్యాస పూర్వక పంచామృత రుద్రాభిషేకాన్ని, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు చెరుకూరి రామకృష్ణశర్మ ఆధ్వర్యంలో పూజాదికాలు జరిగాయి. అనంతరం స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ చైర్మన్ చింతలపాటి బంగార్రాజు, ఈఓ ఆకుల కొండలరావు, ధర్మకర్తలు పర్యవేక్షించారు.
భీమవరం: వచ్చే మార్చిలో జరిగే టెన్త్, ఓఎస్‌ఎస్‌సీ, ఒకేషనల్ పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లించడానికి వచ్చేనెల 18 వరకు గడువు పొడిగించినట్టు డీఈఓ ఓవీఎస్ అనిల్‌కుమార్ బుధవారం ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుం లేకుండా ఈనెల 26 నుంచి డిసెంబర్ 5 వరకు, రూ.50 అపరాధ రుసుంతో డిసెంబర్ 6 నుంచి 9 వరకు, రూ.200 అపరాధ రుసుంతో డిసెంబర్ 10 నుంచి 13 వరకు, రూ.500 అపరాధ రుసుంతో డిసెంబర్ 14 నుంచి 18 వరకు అవకాశముందన్నారు. పరీక్ష ఫీజు రెగ్యులర్ విద్యార్థులకు రూ.125, మూడు సబ్జెక్ట్స్ వరకు రూ.110 చెల్లించాలన్నారు. ఒకేషనల్ విద్యార్థులు రూ.125తోపాటు అదనంగా రూ.60 చెల్లించాలని పేర్కొన్నారు.
తాడేపల్లిగూడెం అర్బన్: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా తాడేపల్లిగూడెం డివిజన్ డీఎస్పీ బి.నరసింహ రావు ఆధ్వర్యంలో పోటీసులు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. పట్టణ, పరిసర ప్రాంతాల్లో అవాంచనీయ సంఘటనలు సంభవిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఎన్నికల సందర్భంగా పట్టణంలో మద్యం దు కాణాలను రెండు రోజుల పాటు మూసివేశారన్నారు. ప్రత్యేక బృందాలతో పట్టణంలో నిరంతరం పోలీసు సిబ్బంది నిఘా ఉంటుందన్నారు. సీఐ బోణం ఆదిప్రసాద్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టులో కేంద్ర మృత్తిక, పదార్థాల పరిశోధన కేంద్రం (సీఎస్‌ఎంఆర్‌ఎస్) నిపుణులు రెండో రోజు బుధ వారం కూడా పరీక్షలు నిర్వహించారు. నిపుణులు హరీంద్రప్రకాశ్, శ్రీహరి టి.నాయర్, అమిత్, జలవనరుల శాఖ ఈఈ బాలకృష్ణమూర్తి, డీఈలు నిర్మల, శ్రీకాంత్, విజయ్, మల్లికార్జున, పటేల్ ఈ పరీక్షల్లో పాల్గొంటున్నారు. ఎంఈఐఎల్ పోలవరం ప్రాజెక్టు జన రల్ మేనేజర్ ఎ.గంగాధర్ కుమార్, డీజీఎంలు గుట్టపాటి శంకరయ్య, మురళి పమ్మి పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్‌లో పరీక్షలు చేశారు. ఇప్పటికే గట్టిపడిన ప్రాంతంలో మట్టిని జేసీబీతో తొలగించి పరీక్షలు చేశారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): క్యూఆర్ కోడ్‌లను డౌన్‌లోడ్ చేసుకుని ఫొటోఫ్రేమ్ చేయించి ప్రతి స్కూల్లోనూ ప్రదర్శించి దానిని తిరిగి అప్‌లోడ్ చేయమని ప్రధానోపాధ్యాయులపై బోధనేత ర భారాన్ని మోపటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీటీఎఫ్ నాయకులు ఓ ప్రకటనలో తెలిపారు. క్యూఆర్ కోడ్లు లేదా స్కానర్లు ఏదైనా సరే ప్రభుత్వమే అందించాలన్నారు.


