వైభవంగా నారసింహుని చక్రస్నానం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా నారసింహుని చక్రస్నానం

Nov 25 2026 9:42 AM | Updated on Nov 25 2026 9:42 AM

ఆగిరిపల్లి: జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఆగిరిపల్లిలో వేంచేసియున్న శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తజన సందోహం మధ్య శోభనాచలునికి చక్రస్నానం, అవబృదోత్సవం కార్యక్రమాలను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం వైభవంగా నిర్వహించారు. స్వామివారి ఆలయంలో ఉదయం అవబృదోత్సవం, సప్తర్షి పూజలు, చందనోత్సవం, చూర్ణోత్సవం, వేద పారాయణ, అనంతరం మేళ తాళాల మధ్య స్వామివారి చక్రస్నానాన్ని కనుల పండుగ నిర్వహించారు. సాయంత్రం ఏడు గంటలకు ఆలయంలో స్వామివారికి మౌనబలి, ధ్వజవరోహణ కార్యక్రమాలను అర్చకులు వేదాంతం శేషుబాబు, అనంత కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉభయ దాతలుగా ఆగిరిపల్లికి చెందిన యండూరి నరసింహమూర్తి అండ్‌ సన్‌, ఇనుగంటి వెంకటరాజు సుధాకర్‌ రావు దంపతులు వ్యవహరించారు. అనంతరం శోభనగిరి కొండపై నుంచి దిగువ వరకు వరకు ఉన్న 750 మెట్లపై భక్తులు దీపాలను వెలిగించి కృత్తికా దీపోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement