అకాల వర్షం.. రైతన్నకు శాపం | - | Sakshi
Sakshi News home page

అకాల వర్షం.. రైతన్నకు శాపం

Nov 25 2026 9:42 AM | Updated on Nov 25 2026 9:42 AM

రైతన్నలను వరుణిడి శాపం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే అర్నబ్‌, మురసు తుపాన్ల ధాటికి తీవ్రంగా నష్టపోయిన రైతులను అకాల వర్షం మరోసారి బెంబేలెత్తించింది. ఉంగుటూరు నియోజకవర్గంలోని ఉంగుటూరు, భీమడోలు, గణపవరంలలో మంగళవారం భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పరుగులు పెట్టారు. రెండు తుపాన్లకు నష్టపోయిన రైతులు మిగిలిన ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకునే పనిలో ఉండగా అకాల వర్షం రైతులను మరింత కుంగదీసింది. రైతులు ధాన్యాన్ని హడావుడిగా పోగుచేసి రాశులపై బరకాలు కప్పి తడవకుండా కాపాడుకున్నారు. – సాక్షి నెట్‌వర్క్‌

చేబ్రోలు ఆయకట్టులో రాశులపై బరకాలు కప్పిన దృశ్యం

భీమడోలు డివైడర్‌ వద్ద బరకాలు కప్పి ధాన్యాన్ని భద్రం చేసుకున్న రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement