తప్పుడు కరపత్రాలపై పోలీసులకు ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

తప్పుడు కరపత్రాలపై పోలీసులకు ఫిర్యాదు

Nov 25 2026 9:36 AM | Updated on Nov 25 2026 9:36 AM

పెనుమంట్ర: తనపై, తన కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ముద్రించిన కరపత్రాలను తెల్లవారుజామున పంపిణీ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారని మార్టేరు గ్రామ సర్పంచ్‌ అభ్యర్థి, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు కర్రి గౌరీ సుభాషిని తెలిపారు. మంగళవారం పెనుమంట్ర పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. మార్టేరు ప్రజల ఆదరాభిమానాలతో ఎంపీటీసీ సభ్యురాలిగా, సర్పంచ్‌గా, అలాగే పెనుమంట్ర మండల ప్రజల మద్దతుతో జడ్పీటీసీగా పనిచేసి ప్రజల సహకారంతో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానని పేర్కొన్నారు. జనరల్‌ మహిళకు రిజర్వ్‌ అయిన సర్పంచ్‌ పదవికి తాను పోటీ చేస్తుండగా, ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందనను ఓర్వలేకే ప్రత్యర్థులు తప్పుడు కరపత్రాలు పంచుతున్నారని ఆరోపించారు. కరపత్రాలు పంచుతున్న పాలకొల్లుకు చెందిన పసుపులేటి నాగసుందరం, పిల్లి సుధీర్‌లను దుండి సంతోష్‌ రాజు, తమిళంపూడి వెంకట సత్యనారాయణ రెడ్డి, మట్ట రాము, జాలెం చంద్ర విజయ భాస్కర్‌ తదితరులు పట్టుకుని పోలీసులకు అప్పగించారని చెప్పారు. కరపత్రంలోని అంశాలు తనను తీవ్రంగా కలచివేశాయని, ఎక్కడో చదువుకుంటున్న తన కుమారులపైనా నిందలు మోపడం కుటుంబాన్ని మానసిక క్షోభకు గురిచేస్తోందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఆమె భర్త, మాజీ ఉప సర్పంచ్‌ కర్రి వేణుబాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement