ఊక లారీల కోసం చెట్ల తొలగింపు | - | Sakshi
Sakshi News home page

ఊక లారీల కోసం చెట్ల తొలగింపు

Nov 25 2026 9:36 AM | Updated on Nov 25 2026 9:36 AM

ఊక లారీల కోసం చెట్ల తొలగింపు పంచాయతీ ఎన్నికల వేళ మట్టి దందా!

ఆకివీడు స్థానిక రైల్వే స్టేషన్‌ రోడ్డు, ఈస్టుపాలెం స్కూల్‌ రోడ్డు, వినాయక గుడి వరకు ఉన్న రోడ్డు మార్జిన్‌లో 15 ఏళ్లుగా ఎదుగుతున్న భారీ చెట్లను మంగళవారం జేసీబీతో తొలగించారు. కొన్నింటిని మోడులుగా నరికి, మరికొన్నింటిని వేళ్లతో సహా పెకిలించారు. నగర పంచాయతీ తీర్మానం, అధికారుల అనుమతులు లేకుండా శానిటరీ మేస్త్రి మురళీ ఆధ్వర్యంలో వీటిని తొలగించారు. ఎమ్మెల్యే చెప్పారన్న మేస్త్రి, ఫోన్‌ చేస్తాననగానే మాట మార్చాడని స్థానికులు తెలిపారు. ఊక లారీలకు అడ్డుగా ఉన్న కొమ్మలు మాత్రమే కొట్టమన్నామని టీడీపీ పట్టణ అధ్యక్షుడు గంధం ఉమ పేర్కొన్నారు. పాలకవర్గం ప్రమాణస్వీకారం చేసిన 24 గంటల్లోనే ఈ ఘటన జరగడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఆగిరిపల్లి: పంచాయతీ ఎన్నికల వేళ కృష్ణవరం పెద్ద చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు వివాదాస్పదంగా మారాయి. ప్రభుత్వ అనుమతులు లేకుండా మంగళవారం రాత్రి చెరువులోని మట్టిని తవ్వి, సుమారు 30 ట్రాక్టర్ల ద్వారా తరలించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు టీడీపీకి చెందిన నాయకుడు ఈ చర్యకు పాల్పడుతున్నారని వారు పేర్కొన్నారు. ఉచిత మట్టిని ఎరగా చూపి ఓట్లు దండుకునేందుకే రాత్రిపూట ఈ అక్రమ రవాణా సాగిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement