ఎన్నికలను బహిష్కరిస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలను బహిష్కరిస్తున్నాం

Nov 25 2026 9:36 AM | Updated on Nov 25 2026 9:36 AM

బుట్టాయగూడెం: ఈ నెల 26వ తేదీన జరగనున్న పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు మండలంలోని రెడ్డిగణపవరం సమీపంలో నివసిస్తున్న తూటిగుంట నిర్వాసితులు ప్రకటించారు. మంగళవారం రాత్రి గ్రామస్తులంతా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తమకు ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేయాలని అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని నిరసిస్తూ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు గ్రామస్తులు కె. సాయిప్రసాద్‌, చింతలాడ పెద్దబ్బాయి, అరగంటి చిన్నారెడ్డి, చింతలాడ రామిరెడ్డి, కోళ్ల మంగిరెడ్డి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తాము తూటికుంట గ్రామాన్ని ఖాళీ చేసి, రెడ్డిగణపవరం సమీపంలోని ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి తరలివచ్చి సంవత్సరాలు గడుస్తున్నా తమ సమస్యలను పట్టించుకునేవారే లేరని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై తామే చర్చించుకునేందుకు వీలుగా ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని ఐదు గ్రామాల నిర్వాసితులు అధికారులకు మొరపెట్టుకున్నా స్పందన లేదని తెలిపారు. దీంతో ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లోనూ సుమారు 1,150 మంది ఓటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉండి బహిష్కరించారని గుర్తుచేశారు. మళ్లీ అదే పరిస్థితి ఎదురవడంతో పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.

పోలవరం తూటిగుంట నిర్వాసితులు వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement