ప్రచారపర్వం సమాప్తం | - | Sakshi
Sakshi News home page

ప్రచారపర్వం సమాప్తం

Nov 25 2026 9:30 AM | Updated on Nov 25 2026 9:30 AM

నామినేషన్ల తిరస్కరణపై ఉద్రిక్తత వెంప హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ సందర్శన కార్మికులకు వేతనంతో కూడిన సెలవు పోలవరం నిర్మాణ నాణ్యతపై తనిఖీలు

న్యూస్‌రీల్‌

ముగిసిన ప్రచారం

ప్రలోభాలు ప్రారంభం

నామినేషన్ల తిరస్కరణపై ఉద్రిక్తత
భోగాపురంలో నామినేషన్లను ఉద్దేశపూర్వకంగా తిరస్కరించడం దారుణమని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి విమర్శించారు. 8లో u
మలివిడతలోని మున్సిపాల్టీలు, తొలి విడతలోని పంచాయతీల్లో ప్రచారానికి తెరపడింది. చివరిరోజు కావడంతో మంగళవారం రోడ్‌షోలు, ర్యాలీలతో రాజకీయ పార్టీలు, స్వతంత్రులు ప్రచారాన్ని హోరెత్తించారు. పోలింగ్‌కు ఒక్క రోజు మాత్రమే గడువుండటంతో అభ్యర్థులు గెలుపు కోసం తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

బుధవారం శ్రీ 25 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

భీమవరం అర్బన్‌: మండలంలోని వెంప గ్రామంలోని హెల్త్‌ అండ్‌ వెల్నెస్‌ సెంటర్‌ను నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం), కామన్‌ రివ్యూ మిషన్‌ (సీఆర్‌ఎం) బృంద సభ్యులు మంగళవారం సందర్శించారు. జిల్లా ఆయుష్‌ అధికారి డాక్టర్‌ శ్రీరామ్‌, జిల్లా తనిఖీ అధికారి డాక్టర్‌ రవిశేఖర్‌ నేతృత్వంలో వచ్చిన ఈ బృందం కేంద్రం పరిసరాలు, పరిశుభ్రత, రికార్డులు, రిజిస్టర్లను తనిఖీ చేసింది. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు, రోగులకు అందుతున్న వైద్య సేవల తీరుపై సిబ్బందిని, రోగులను అడిగి తెలుసుకున్నారు. సేవలను మరింత మెరుగుపరిచేందుకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ ప్రసాద్‌, ఆయుర్వేద వైద్యులు డాక్టర్‌ కిషోర్‌, పీహెచ్‌సీ వైద్యాధికారిణి దయామణి తదితరులు పాల్గొన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లోని దుకాణాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించినట్లు అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ జిల్లా ఇన్‌చార్జి అధికారి ఆకన లక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26, 29, డిసెంబర్‌ 2వ తేదీల్లో మూడు విడతలుగా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు, ఈ నెల 26న భీమవరం, తణుకు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో జరిగే మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని కార్మికులందరికీ సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కార్మికుడు ఓటు హక్కు వినియోగించుకునేలా యాజమాన్యాలు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

పోలవరం రూరల్‌: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని కేంద్ర మృత్తిక, పదార్థాల పరిశోధన కేంద్రం (సీఎస్‌ఎంఆర్‌ఎస్‌) నిపుణులు క్షేత్రస్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ప్రారంభమైన ఈ తనిఖీలు ఈ నెల 26 వరకు కొనసాగనున్నాయి. సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ నిపుణులు హరీంద్ర ప్రకాశ్‌, శ్రీహరి టి. నాయర్‌, అమిత్‌ సేన్‌ ఆధ్వర్యంలో పరీక్షలు జరుగుతున్నాయి. ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యామ్‌ నిర్మాణంలో వినియోగిస్తున్న మట్టి, రాయి, ఇసుక నాణ్యతతో పాటు వాటి సాంద్రత, కుదింపు స్థితిని పరిశీలించారు. షీప్‌ఫుట్‌ రోలర్‌తో కుదించిన మట్టి సాంద్రత, తేమ శాతాన్ని తనిఖీ చేశారు. గ్యాప్‌–2లోనూ ఈ పరీక్షలు చేశారు.

సాక్షి, భీమవరం: జిల్లాలోని నాలుగు మున్సిపాల్టీలు, 80 పంచాయతీల్లో గురువారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌ నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధంచేశారు. భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు మున్సిపాల్టీల్లో చైర్‌పర్సన్‌ కోసం మొత్తం 30 మంది పోటీలో ఉండగా 178 వార్డుల్లో కౌన్సిలర్‌ అభ్యర్థులుగా 485 మంది బరిలో ఉన్నారు. పాలకొల్లులో చైర్‌పర్సన్‌ కోసం వైఎస్సార్‌సీపీ, కూటమి, కాంగ్రెస్‌ తదితర పార్టీల నుంచి, స్వతంత్రులు మొత్తం 14 మంది పోటీలో ఉన్నారు. అలాగే 43 వార్డులకు కౌన్సిలర్‌ పదవుల కోసం 116 మంది ఉన్నారు. భీమవరంలో చైర్‌పర్సన్‌ కోసం నలుగురు, 48 వార్డులకు 146 మంది పోటీ చేస్తున్నారు. తణుకులో చైర్‌పర్సన్‌కు ఐదుగురు, 42 వార్డులకు 107 మంది, తాడేపల్లిగూడెంలో చైర్‌పర్సన్‌కు ఏడుగురు, 45 వార్డులకు 116 మంది పోటీలో ఉన్నారు. మున్సిపాల్టీల్లో ఎన్నికల కోసం 183 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా వాటిలో 18 అత్యంత సమస్యాత్మక, 44 సమస్యాత్మక, 121 సాధారణ పోలింగ్‌ కేంద్రాలను పోలీసులు గుర్తించారు. బందోబస్తు కోసం 373 మంది పోలీసు సిబ్బందిని కేటాయించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు 51 రూట్‌ మొబైల్స్‌, 12 స్ట్రైకింగ్‌ ఫోర్స్‌, 8 స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ బృందాలను సిద్ధం చేసినట్టు పోలీస్‌ అధికారులు తెలిపారు. 87 రూట్‌ మొబైల్స్‌, 22 స్ట్రైకింగ్‌ ఫోర్స్‌, 13 స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ బృందాలు సమన్వయంతో పనిచేస్తాయన్నారు.

80 పంచాయతీల్లో ఎన్నికలు

తొలి విడతలో నరసాపురం డివిజన్‌లో 90 పంచాయతీలకు మొగల్తూరు మండలంలో పాతపాడు, కేపీ పాలెం సౌత్‌, పెనుగొండ మండలంలో రామన్నపాలెం, సిద్దాంతం, తామరాడ, నరసాపురం రూరల్‌లో వేములదీవి ఈస్ట్‌, పెదమైనివానిలంక, సరిపల్లె, పెనుమంట్ర మండలంలో నత్త రామేశ్వరం, ఓదూరు పంచాయతీలు ఏకగ్రీవం కాగా 80 పంచాయతీలకు 229 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 1006 వార్డులకు 383 వార్డులు ఏకగ్రీవం కాగా 623 వార్డుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు మొత్తం 355 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 15 అత్యంత సమస్యాత్మక, 81 సమస్యాత్మక, 269 సాధారణ పోలింగ్‌ కేంద్రాలుగా పోలీసులు గుర్తించి 435 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరంతర పెట్రోలింగ్‌, తక్షణ స్పందన కోసం 36 రూట్‌ మొబైల్స్‌, 10 స్ట్రైకింగ్‌ ఫోర్స్‌, ఐదు స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ బృందాలను రంగంలోకి దించినట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు.

పాలకొల్లులో అభ్యర్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్న నాయకులు

పెనుగొండ: ములపర్రులో ప్రచారం చేస్తున్న మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు

పాలకొల్లు సెంట్రల్‌: పాలకొల్లు ప్రాంత ప్రజలకు సుపరిచితమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన చందక ఉమా శైలజ పదో తరగతి వరకు విద్యాభ్యాసం చేశారు. ఈమె భర్త చందక సత్తిబాబు, తాత చందక అప్పలస్వామి గతంలో కౌన్సిలర్లుగా పని చేయడంతో పట్టణంలో వీరి కుటుంబానికి మంచి గుర్తింపు ఉంది. ఒక్క అవకాశం ఇస్తే పాలకొల్లును ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దుతానని ఆమె చెబుతున్నారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జనాదరణ, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి), సీఈసీ సభ్యులు గుణ్ణం నాగబాబు, మేకా శేషుబాబు తదితర నాయకుల అండదండలు, పట్టణ ప్రజల ఆదరాభిమానాలు తనకు విజయాన్ని అందిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్న చందక ఉమా శైలజతో ‘మాటామంతి’...

?: చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఎప్పుడైనా ఊహించారా?

ప్రజాసేవ చేయాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. మా కుటుంబంలో నా భర్త, తాత అప్పలస్వామి కౌన్సిలర్లుగా పనిచేస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేవారు. నేడు నేను చైర్‌పర్సన్‌గా, మా కుమార్తె చందక రోహిణి 31వ వార్డు కౌన్సిలర్‌గా పోటీలో ఉన్నాము. ఇలా చైర్‌పర్సన్‌ పదవికి పోటీ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను.

?: పాలకొల్లు చరిత్రలో తొలిసారి బీసీ

మహిళకు రిజర్వేషన్‌ దక్కడంపై మీ స్పందన?

వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ మున్సిపల్‌ చరిత్రలో ఇప్పటివరకు బీసీ మహిళకు రిజర్వేషన్‌ దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించింది. తొలి బీసీ మహిళా చైర్‌పర్సన్‌ స్థానంలో కూర్చునే అదృష్టాన్ని జగనన్న నాకు కల్పించారు. ఈ నెల 26న ప్రజల మద్దతుతో ఆ అవకాశం నాకే దక్కుతుందని ఆశిస్తున్నాను.

?: అధికార పార్టీ, మంత్రి నియోజకవర్గంలో బలమైన ప్రత్యర్థిని ఎలా ఎదుర్కోబోతున్నారు?

పోటీలో ఉన్న ప్రత్యర్థి, అధికార పార్టీ రెబల్‌ అభ్యర్థి, నేను.. ముగ్గురం ఒకే సామాజిక వర్గానికి చెందినవాళ్లం. అధికార పార్టీ ఓట్లను చీల్చే రెబల్‌ అభ్యర్థి బలమైన వ్యక్తి కావడం మాకు కలిసొచ్చే అంశం. చుట్టుపక్కల గ్రామాలు నూతనంగా పట్టణంలో విలీనం కావడంతో ఆ ఓటు బ్యాంకు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా మారుతుంది.

?: ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే పట్టణానికి ఏం చేస్తారు?

రోడ్లు, డ్రెయినేజీ, ట్రాఫిక్‌, కాలుష్యం వంటి సమస్యలు పట్టణ ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడిని, ఎప్పటినుంచో వేధిస్తున్న డంపింగ్‌ యార్డ్‌ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తాను. పార్కులు, ఎన్టీఆర్‌ కళాక్షేత్రం పనులను త్వరితగతిన పూర్తి చేయిస్తాను. పట్టణ జనాభా 30 వేలు ఉన్నప్పుడు నియమించిన పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య పదవీ విరమణలు, మరణాల వల్ల తగ్గిపోయింది. నేడు జనాభా లక్ష దాటినా అరకొర సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. అవసరమైన మేర కొత్తగా పారిశుద్ధ్య కార్మికులను నియమించి, పట్టణ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుస్తాను.

?: మీ విజయానికి దోహదపడే ప్రధాన అంశాలు?

అధికార పార్టీ నాయకులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. స్వయంగా ఆ పార్టీ నేతల్లోనే లోపాయికారి అసంతృప్తి నెలకొంది. కూటమి పాలనతో విసుగు చెందిన ప్రజలు, గతంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందించిన సంక్షేమ పథకాలను అనవసరంగా వదులుకున్నామని ఆవేదన చెందుతున్నారు. నాటి జగనన్న పాలనకు, నేటి కూటమి పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వారు గమనిస్తున్నారు. ప్రచారంలో ప్రజలు చెబుతున్న సాధకబాధకాలను బట్టి చూస్తే, కూటమి ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెప్పాలని వారు నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది.

?: ప్రభుత్వ వ్యతిరేకత మీకు ఏ విధంగా లాభిస్తుంది?

‘సూపర్‌ సిక్స్‌’ అంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. జగనన్న హయాంలో ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఇప్పటికీ మౌలిక వసతులు కల్పించకుండా తాత్సారం చేస్తోంది. ఏదైనా మంచి జరిగితే తమ ఖాతాలో వేసుకోవడం, సమస్య ఎదురైతే ప్రతిపక్షాలపై నెట్టేయడం కూటమి నేతలకు వెన్నతో పెట్టిన విద్య. గతంలో ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, పింఛను కానుక, పేదలందరికీ ఇల్లు, చేదోడు, కాపు నేస్తం, నేతన్న నేస్తం వంటి పథకాలతో జగనన్న పేదలకు భరోసా ఇచ్చారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రెండేళ్లలో ఒక్క కొత్త పింఛను కూడా ఇవ్వలేదు. పట్టణంలోని 7,164 ఎల్‌ అండ్‌ టీ ఇళ్లలో 2,450 ఇళ్లను లబ్ధిదారులకు అందించిన ఘనత జగనన్న ప్రభుత్వానిదే. మిగిలిన ఇళ్లను ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. కొత్తగా ఒక్క ఇంటి స్థలం కూడా ఇవ్వని వీరు అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది.

?: పట్టణ ప్రజలకు మీరు చేసే విజ్ఞప్తి?

కింది స్థాయి నుంచి కష్టపడి ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నాను. పేదల కష్టనష్టాలు తెలిసిన వ్యక్తిని. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, సమస్యలను పరిష్కరించడమే నా సంకల్పం. కాబట్టి, నాతో పాటు పట్టణంలోని 44 వార్డుల్లో పోటీ చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులందరినీ ‘సీలింగ్‌ ఫ్యాన్‌’ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను.

మున్సిపాల్టీలు, తొలి విడత పంచాయతీల్లో సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. కొద్దిరోజులుగా హోరెత్తిస్తున్న మైకులు మూగబోయాయి. చివరి రోజు కావడంతో మున్సిపల్‌, పంచాయతీ బరిలోని అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. తమకు కేటాయించిన గుర్తులను ఓటర్లకు చూపిస్తూ ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. తాము గెలిస్తే చేపట్టేబోయే అభివృద్ధి పనులను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలం కనిపించింది.

పోలింగ్‌కు ఒక్క రోజు మాత్రమే వ్యవధి ఉండటంతో మంగళవారం రాత్రి నుంచి పలు గ్రామాల్లో కూటమి ప్రలోభాలకు తెరలేపింది. ఓటుకు రూ. 500 నుంచి రూ. వెయ్యి వరకు పంపిణీకి సన్నాహాలు చేస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉన్న వార్డులు, పంచాయతీల్లో రూ.2 వేలకు పైనే ముట్టచెప్పనున్నట్టు సమాచారం. అభ్యర్థులు ఎవరికి వారు తమ అనుచరుల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా పంపిణీ సాగించే పనిలో ఉన్నారు. అదనంగా పురుషులకు మద్యం బాటిల్స్‌ ఇస్తుండగా, కొన్నిచోట్ల మహిళలకు చీరలు అందజేస్తున్నట్టు తెలిసింది.

రేపే నాలుగు మున్సిపాల్టీలు, 80 పంచాయతీలకు పోలింగ్‌

మున్సిపాల్టీలు, తొలివిడత పంచాయతీల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం

మూగబోయిన మైకులు

పంపకాల్లో కూటమి అభ్యర్థులు బిజీ

ఓటుకు రూ. 500 నుంచి రూ. రెండు వేలకు పైనే పంపకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement