రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ | - | Sakshi
Sakshi News home page

రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ

Nov 25 2026 9:30 AM | Updated on Nov 25 2026 9:30 AM

రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ

భీమవరం: ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్‌ కేఆర్‌ కల్పశ్రీ అధికారులను ఆదేశించారు. రీసర్వే, ధాన్యం సేకరణ తదితర అంశాలపై రెవెన్యూ, వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ అధికారులతో మంగళవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కల్పశ్రీ మాట్లాడుతూ మిల్లులకు ధాన్యం తరలించేటప్పుడు మిగిలిన గోనె సంచులను రైతులు తిరిగి అప్పగించాలని సూచించారు. గోనె సంచుల కొరత ఎక్కడా లేకుండా చూడాలని, తణుకు, తాడేపల్లిగూడెంలో తలెత్తిన సమస్యను తక్షణమే పరిష్కరించామని చెప్పారు. మిల్లర్లు తమకు కేటాయించిన ధాన్యం సేకరణ లక్ష్యంలో 75 శాతం పూర్తి చేసి, వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. రైతులు తమ ధాన్యాన్ని ఏ మిల్లుకు తరలించాలనేది స్వయంగా ఎంచుకునే అవకాశం ఉందని, దీనిపై వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా సేకరణ జరగాలని, రీసర్వే లక్ష్యాలను సమన్వయంతో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి జి. సునీత, డీఎం ఇబ్రహీం, డీఎస్‌ఓ సరోజ, ఆర్డీవోలు, తహసీల్దార్లు, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement