వైభవం.. తిరుకల్యాణోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవం.. తిరుకల్యాణోత్సవం

Nov 24 2026 12:54 AM | Updated on Nov 24 2026 12:54 AM

వైభవం.. తిరుకల్యాణోత్సవం అధ్యాపకురాలి ఆత్మహత్య.. కేసు నమోదు

ఆగిరిపల్లి: శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహ స్వామివారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారి దివ్య తిరుకళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ, స్నపన తిరుమంజనం, నిత్య హోమం, గరుడోత్సవం ఆలయ అర్చకులు వేదాంతం శేషుబాబు ఆధ్వర్యంలో జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

ఏలూరు టౌన్‌: ఏలూరు వన్‌టౌన్‌ పరిధిలోని నవాబుపేటకు చెందిన యువతి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు ఏలూరులోని ఒక ఇంజనీరింగ్‌ కళాశాలలో గణితం విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న తియ్యాల జయశ్రీ (26)గా గుర్తించారు. సమాచారం అందుకున్న వన్‌టౌన్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆమె మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో, ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. క్లూస్‌టీమ్‌ రంగంలోకి దిగి ఆధారాలు సేకరించింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆమె సూసైడ్‌ నోట్‌ రాసినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement