కొత్త వార్డుల్లో ఫ్లాగ్‌మార్చ్‌ | - | Sakshi
Sakshi News home page

కొత్త వార్డుల్లో ఫ్లాగ్‌మార్చ్‌

Nov 24 2026 12:54 AM | Updated on Nov 24 2026 12:54 AM

కొత్త వార్డుల్లో ఫ్లాగ్‌మార్చ్‌ ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ గోనె సంచులు అందించాలి ఓటుకు ‘బాండింగ్‌’

తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెంలో మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో కొత్త వార్డులు కుంచనపల్లి, ఎల్‌.అగ్రహారం, కొండ్రుప్రోలు, పడాల, ప్రత్తిపాడులో డీఎస్పీ నరసింహారావు ఆధ్వర్యంలో సోమవారం పోలీసుల ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల్లో భద్రతాభావం కల్పించడం, అ వాంచనీయ సంఘటనలు జరగకుండా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక పోలీస్‌ నిఘా, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును విని యోగించుకోవాలని డీఎస్పీ అన్నారు. తాడేపల్లిగూడెం సీఐ బి.శ్రీనివాసరావు, ఎస్సై రవికుమర్‌, పెంటపాడు ఎస్సై బి.కిరణ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): పంచాయతీ ఎన్ని కల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం కల్పించినట్టు డీపీఓ టి.విజయ్‌భాస్కర్‌ సోమవారం ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎంపీడీఓ కార్యాలయాల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. జి ల్లాలోని ఆచంట, మొగల్తూరు, నరసాపురం, పెనుగొండ, పెనుమంట్ర మండలాల్లో ఈ అవకాశం ఉందన్నారు.

భీమవరం : ధాన్యం సేకరణలో భాగంగా మిల్లర్ల నుంచి సేకరించిన గోనె సంచులను రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు పంపిణీ చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ కేఆర్‌ కల్పశ్రీ అన్నారు. సోమవారం స్థానిక ఎస్‌ఆర్‌కేఆర్‌ కళాశాల ఆడిటోరియంలో గోనె సంచుల సేకరణ, రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ విధానం, యాప్‌లో వివరాల నమోదు, డేటా అప్‌లోడ్‌ ప్రక్రియ, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై డేటా ఆపరేటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, గోనె సంచులు అందుబాటులో ఉంచడం తప్పనిసరన్నారు. గోనె సంచుల పంపిణీ వివరాలను యాప్‌లో ఎ ప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. ప్రక్రి య పక్కాగా నిర్వహించాలన్నారు. ధాన్యం కొనుగోలు సమయంలో అధికారులు జాగ్రత్త వహించాలని, మిల్లు వద్ద ఉన్న వాహనాలకు ట్రక్‌ షీట్‌లు జనరేట్‌ చేయవద్దన్నారు. రైతులకు ఎటువంటి సమస్యలు ఉన్నా భీమవరంలో కంట్రోల్‌ రూమ్‌ 8121676653లో సంప్రదించవచ్చన్నారు. జిల్లా పౌర సరఫరాల మేనేజర్‌ ఇబ్రహీం, జిల్లా కో–ఆపరేటివ్‌ అధికారి తదితరులు పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెం : తమకు ఓటేస్తే ఈ సౌకర్యాలు కల్పిస్తామంటూ ఓటుకు బాండ్‌ రాసిస్తున్నారు తాడేపల్లిగూడెం 32వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బత్తిన నాగేంద్రబాబు. ఇంటి య జమాని అడ్రస్‌ తెలిసేలా ఇంటి వద్ద నేమ్‌ బోర్డు చేయించి పెడతా.. రోడ్లు, డ్రైన్లు శుభ్రంగా ఉంచుతా.. ప్రతి ఆదివారం మీ ఇంటికి వచ్చి సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తా.. ప్ర భుత్వ నిధులు రాకున్నా సొంత నిధులతో అభివృద్ధి చేస్తా.. గెలిపించండి.. మాట నిలబెట్టుకోకపోతే రాజీనామా చేస్తా.. అంటూ రూ.100 నాన్‌ జ్యూడీషియల్‌ స్టాంప్‌పై రాసిచ్చి ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంది.

పోలీసుల కవాతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement