భీమవరం (ప్రకాశంచౌక్): స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ, పోస్టల్ బ్యాలెట్ల భద్రత కోసం ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ను ఇన్చార్జి కలెక్టర్ కేఆర్ కల్పశ్రీ పరిశీలింఆచరు. ఎన్నికల సిబ్బందికి కల్పించిన సౌకర్యాలు, ఓటింగ్ ప్రక్రియ నిర్వహణ, బ్యాలెట్ పత్రాల స్వీకరణ, వాటి భద్రత తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని ఆదేశించారు. అలాగే స్ట్రాంగ్ రూమ్ భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణ, స్ట్రాంగ్ రూమ్ వద్ద విధులు నిర్వహించే సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ పత్రాల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశను నిబంధనల ప్రకారం నిర్వహిస్తూ, ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు సమర్థవంతంగా చేయాలని సూచించారు. ఆమె వెంట ఆర్డీఓ కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎం.రామచంద్రారెడ్డి, సిబ్బంది ఉన్నారు.


