బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీలు

Nov 21 2026 12:26 AM | Updated on Nov 21 2026 12:26 AM

బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీలు డీఎస్సీకి ఆన్‌లైన్‌ కోచింగ్‌ నేడు శ్రీవారి తెప్పోత్సవం పఠనాస్తకిని పెంచాలి గిరి పల్లెల్లో వైద్య శిబిరం

భీమవరం: విద్యార్థులు పరిశోధనారంగంపై దృష్టి పెట్టి భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని జిల్లా సైన్స్‌ అధికారి మల్లుల శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. స్థానిక చింతలపాటి బాపిరాజు మెమోరియల్‌ హైస్కూల్లో రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి, విద్యా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 32వ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌–2026 జిల్లాస్థాయి ప్రాజెక్ట్‌ పోటీలు శుక్రవారం నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 105 మంది విద్యార్థులు ప్రాజెక్టులు ప్ర దర్శించారు. శ్రీనివాస్‌తో పాటు జిల్లా అకడమిక్‌ కో–ఆర్డినేటర్‌ చీలి రాజు, మాజీ అకడమిక్‌ కో–ఆర్డినేటర్‌ ఎంవీ భాస్కరరావు తదితరులు పర్యవేక్షించారు. విజేతలకు బహుమతులు అందించారు. జిల్లాస్థాయిలో పి.వాగ్దేవి (జెడ్పీహెచ్‌ఎస్‌ కోపల్లె), డీజే షణ్ముఖ (పోస్ట్‌ బేసిక్‌ స్కూల్‌, పెంటపాడు), వి.దిలీప్‌కుమార్‌ (బీఆర్‌ఎంవీ హైస్కూల్‌ పాలకొల్లు), డి.రామ్‌చరణ్‌ (పీఎంసీ జెడ్పీ హైస్కూల్‌, తణుకు), ఆర్‌.రోషిణి నాగగౌరి (ఏపీ బీసీ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌, నరసాపురం), వి.మనోజ్‌వర్మ (జెడ్పీ హెచ్‌ఎస్‌ దొంగపిండి), వి.ప్రీతి (అభ్యాస్‌ స్కూల్‌, పెదమిరం) నిలిచారు. వీరు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

భీమవరం: బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో డీఎస్సీ–2026కు బీసీ అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఉచిత కోచింగ్‌ పొందవచ్చని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి తెలిపారు. జిల్లాకు చెందిన అభ్యర్థులు ఈనెల 25 సాయంత్రంలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను కలెక్టరేట్‌లోని జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు. వివరములకు సెల్‌ 9490134897, 8106677598 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

ద్వారకాతిరుమల: శ్రీవారి పుష్కరణి (నృసింహ సాగరం)లో శనివారం రాత్రి జరుగనున్న చిన వెంకన్న తెప్పోత్సవానికి సర్వం సిద్ధమైంది. స్వామి విహరించనున్న తెప్పను హంస వాహనంగా అలంకరిస్తున్నారు. భక్తులకు రక్షణకు పుష్కరణి గట్లపై బారికేడ్లు నిర్మించారు. సాగరం మధ్యలోని మండపానికి, గట్లపైన, చెట్లకు విద్యుద్దీప అలంకారాలు చేశారు. రాత్రి 8 గంటలకు స్వామి తొళక్క వాహనంపై బయలుదేరి పుష్కరణి వద్దకు చేరుకుంటారని, అనంతరం తెప్పోత్సవం ప్రారంభమవుతుందని ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు.

భీమవరం: పుస్తక పఠనంతో విద్యార్థుల్లో జ్ఞానం, నైపుణ్యాలు, సృజన్మాతకత పెంపొందుతాయని ఇన్‌చార్జి కలెక్టర్‌ కేఆర్‌ కల్పశ్రీ అన్నారు. శుక్రవారం భీమవరం గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకు మొబైల్‌ ఫోన్లు ఇవ్వ డం తగ్గించి, వారిలో పఠనాసక్తిని పెంచే విజ్ఞానదాయకమైన పుస్తకాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, ముగ్గుల పోటీలు, క్విజ్‌, ఫాన్సీ డ్రెస్‌, డ్యాన్స్‌ తదితర పోటీలు నిర్వహించగా విజేతలుగా నిలిచిన 180 మందికి ఆమె బహుమతులు అందించారు. డీఎస్పీ రఘువీర్‌విష్ణు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ అభివృద్ధి సంస్థ సెక్రటరీ ఎస్‌ఎం శేఖర్‌బాబు, ఎమ్మార్వో రవిబాబు, గ్రంధాలయ అభివద్ధి కమిటీ అధ్యక్షుడు అల్లూరి నరసింహారాజు, సభ్యులు పాల్గొన్నారు.

కుక్కునూరు: మండలంలోని ఉప్పెరు పంచా యతీ పరిధిలోని ఎర్రపాడు, రెడ్డిగూడెం, తోగూడెం గిరిజన గ్రామాల్లో జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయంపై ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురించిన ‘వణికిస్తున్న విషజ్వరాలు’ కథనానికి వైద్యశాఖ అధికారులు స్పందించారు. ఆయా గ్రామాల్లో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య పరీక్షలు చేశారు. అమరవరం పీహెచ్‌సీ వైద్యురాలు దివ్యను వివరణ కోరగా గ్రామాల్లో వైరల్‌ ఫీవర్లు ఉన్నట్టు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement