న్యూస్‌రీల్
అపహరించి, కుటుంబాలను బెదిరించి..
బరిలో నిలిచింది వీరే..
రెండో రోజు 208 నామినేషన్లు
శురకవారం శ్రీ 20 శ్రీ నవంబర్ శ్రీ 2026
సాక్షి, భీమవరం: మలివిడత మున్సిపల్ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పురపాలక సంఘాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం మధ్యాహ్నం మూడు గంటలతో ముగియడంతో చైర్‌పర్సన్, కౌన్సిలర్ పదవుల బరిలో నిలిచే అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. ఈ నెల 26న పోలింగ్ జరగనుండటంతో అభ్యర్థులు గురువారం రాత్రి నుంచే వార్డుల్లో పర్యటనలు ప్రారంభిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
అధికార బలంతోనే ఏకగ్రీవాలు..
ఓటమి భయంతో కూటమి నేతలు ప్రత్యర్థులను బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి పది వార్డులను అడ్డగోలుగా ఏకగ్రీవం చేసుకున్నారని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది. వ్యాపారాలు, ఉపాధిని దెబ్బతీస్తామని, ఉద్యోగాలు తీయిస్తామని, ఇళ్లు ఖాళీ చేయిస్తామని బెదిరించడంతో పాటు నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా అధికార పక్షాల ఒత్తిడితో అధికారులు ఉపసంహరణకు అవకాశం కల్పించారని విమర్శలు వెల్లువెత్తాయి. జిల్లాలోని 188 వార్డులకు గానూ 10 వార్డులు ఏకగ్రీవం కాగా, నాలుగు మున్సిపాలిటీల్లో ఛైర్మన్ పదవులతో పాటు 178 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పోటీలో నిలిచారు.
అభ్యర్థులను దాచి పెట్టి మరీ
తాడేపల్లిగూడెంలో తమ ఇద్దరు అభ్యర్థులను దాచిపెట్టి, దగ్గరుండి మరీ నామినేషన్లు ఉపసంహరింపజేశారని నియోజకవర్గ కో–ఆర్డినేటర్ వడ్డి రఘురాం నాయుడు మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులను స్టేషన్‌కు పిలిపించి పోలీసుల ద్వారా ఒత్తిడి తెచ్చారని, బలవంతంగా అభ్యర్థులను తీసుకెళ్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు భీమవరం 51వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఉపసంహరించుకున్నారంటూ జరిగిన ప్రచారాన్ని సదరు అభ్యర్థి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆ వార్డు ఏకగ్రీవం కాలేదని అధికారులు ప్రకటించారు.
● భీమవరం: చైర్‌పర్సన్ పదవికి యాదాల మాధవిలత (వైఎస్సార్‌సీపీ), చుండూరి మల్లేశ్వరి (జనసేన), పుచ్చకాయల శిరీష (కాంగ్రెస్), మువ్వల ఎస్తేరురాణి (స్వతంత్ర) పోటీపడుతున్నారు. మొత్తం 52 వార్డుల్లో నాలుగు ఏకగ్రీవం కాగా, 48 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ, 23 వార్డుల్లో టీడీపీ, 21 వార్డుల్లో జనసేన, 4 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు.
● తణుకు: చైర్‌పర్సన్ బరిలో ఇండుగపల్లి బలరామకృష్ణ (వైఎస్సార్‌సీపీ), బసవ వీరవెంకట సత్యరామకృష్ణ (టీడీపీ), కడలి రామారావు (కాంగ్రెస్) సహా నలుగురు స్వతంత్రులు ఉన్నారు. 44 వార్డుల్లో రెండు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన వాటిలో వైఎస్సార్‌సీపీ 42, టీడీపీ 29, జనసేన 9, బీజేపీ 4 వార్డుల్లో పోటీ చేస్తున్నాయి.
● తాడేపల్లిగూడెం: చైర్‌పర్సన్ పదవికి గొర్రెల శ్రీనివాస్ (వైఎస్సార్‌సీపీ), పాలూరి వెంకటేశ్వరరావు (జనసేన), మారినీడి బాబ్జి (కాంగ్రెస్) పోటీలో ఉన్నారు. మొత్తం 48 వార్డుల్లో మూడు ఏకగ్రీవం కాగా, వైఎస్సార్‌సీపీ 43 వార్డులో, సీపీఎం 2 వార్డుల్లో కలిసి బరిలో ఉన్నాయి. కూటమి తరఫున టీడీపీ 22, జనసేన 19, బీజేపీ 4 వార్డుల్లో పోటీపడుతున్నాయి.
● పాలకొల్లు: చైర్‌పర్సన్ పదవికి చందక రమాశైలజ (వైఎస్సార్‌సీపీ), ఆబోతుల ఉషారాణి (టీడీపీ), అమీనా బేగం (కాంగ్రెస్), టీడీపీ రెబల్ అభ్యర్థి కర్నేని రోజారమణి సహా మొత్తం 14 మంది పోటీలో నిలిచారు. 44 వార్డుల్లో ఒకటి ఏకగ్రీవమవ్వగా, వైఎస్సార్‌సీపీ 43, టీడీపీ 33, జనసేన 7, బీజేపీ 3 వార్డుల్లో తలపడుతున్నాయి.
తాడేపల్లిగూడెం: మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యర్థి అభ్యర్థులను బరిలో లేకుండా చేసేందుకు కూటమిలోని ఒక పార్టీ నాయకులు అపహరణలు, బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. స్ట్రైక్ రేట్ అంటూ డాంబికాలకు పోయే సదరు పార్టీ నేతలు, బరిలో నిలిచిన 28 మంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నేరుగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఒక వార్డులో మహిళా అభ్యర్థిని బెదిరించడంతో పాటు ఆమె భర్తపై పిడిగుద్దులతో దాడి చేసి నామినేషన్ ఉపసంహరింపజేశారు. మరికొందరు అభ్యర్థుల పిల్లలకు హాని తలపెడతామని హద్దులు మీరి బెదిరించారు. ఆగడాలు పరాకాష్టకు చేరడంతో కుటుంబ సభ్యులు, పిల్లల శ్రేయస్సు దృష్ట్యా ముగ్గురు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఈ మూడు వార్డులు ఏకగ్రీవమైనట్లు జనసేన ప్రకటించుకుంది. మరో మూడు వార్డుల్లోనూ ఇలాంటి ప్రయత్నాలే జరిగాయి.
ఒక రిజర్వ్‌డ్ వార్డులో కూటమి బెదిరింపులకు భయపడి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నామినేషన్ విత్‌డ్రా చేసుకున్నప్పటికీ, అదే వార్డులో పార్టీ తరఫున దాఖలైన మరో నామినేషన్‌కు బీ–ఫారం ఇవ్వడంతో ప్రత్యర్థుల పాచిక పారలేదు. ఇంకో వార్డులో పోటీ చేస్తున్న విశ్రాంత ఉద్యోగిని అపహరించేందుకు చేసిన ప్రయత్నాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులు సకాలంలో అడ్డుకుని విఫలం చేశారు. మరో రిజర్వ్‌డ్ వార్డులో పోటీ నుంచి తప్పుకోకపోతే పిల్లలను చంపేస్తామని హెచ్చరించినా.. తలలు తెగినా వెనక్కి తగ్గేదే లేదు అంటూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ధీటుగా బరిలో నిలిచారు. ఇంత జరుగుతున్నా రక్షక్ష భటులు చూసీచూడనట్లు మిన్నకుండిపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నేటితో రెండో దశ పంచాయతీలకు ముగుస్తున్న నామినేషన్ల గడువు
రేపటి నుంచి మూడో దశకు నామినేషన్లు
ముగిసిన ఉపసంహరణ గడువు
బరిలో నిలిచే అభ్యర్థులు ఖరారు
చైర్మన్ పదవికి భీమవరంలో చతుర్ముఖ, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లులో బహుముఖ పోటీ
నామినేషన్ల ఉపసంహరణలకు కూటమి విశ్వప్రయత్నాలు
బెదిరించి మరీ పది వార్డులు ఏకగ్రీవం చేయించుకున్న వైనం
నేటి నుంచి ముమ్మరం కానున్న ప్రచారం


