గూడెంలో కూటమికి భారీ షాక్‌ | - | Sakshi
Sakshi News home page

గూడెంలో కూటమికి భారీ షాక్‌

Nov 20 2026 2:30 AM | Updated on Nov 20 2026 2:30 AM

గూడెంలో కూటమికి భారీ షాక్‌ హెచ్‌ఎం అక్కౌంట్స్‌ పరీక్ష ఫీజు చెల్లించాలి

వైఎస్సార్‌సీపీలో చేరిన బడుగు పెద్ద

తాడేపల్లిగూడెం: పట్టణంలో కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న మాజీ కౌన్సిలర్‌, మాజీ కో–ఆప్షన్‌ సభ్యులు బడుగు వెంకటేశ్వరరావు (పెద్ద) గురువారం వైఎస్సార్‌సీపీ తాడేపల్లిగూడెం కన్వీనర్‌ వడ్డి రఘురాం సమక్షంలో ఆ పార్టీలో చేరారు. గతంలో ప్రస్తుత ఎమ్మెల్యే బొలిశెట్టి చైర్మన్‌గా ఉన్న సమయంలో ఆయనకు ప్రధాన సలహాదారుగా పని చేశారు. గౌడ సామాజిక వర్గ ప్రతినిధిగా పట్టణంలోని అన్ని వర్గాలతో సత్సంబంధాలు కలిగిన ఆయన, పార్టీ సిద్ధాంతాలు నచ్చి చేరినట్లు తెలిపారు. వెంకటేశ్వరరావు చేరిక పార్టీకి ఎంతో బలాన్నిస్తుందని రఘురాం పేర్కొన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వచ్చే డిసెంబరులో జరగనున్న హెచ్‌ఎం అకౌంట్స్‌ పేపర్‌–1, పేపర్‌–2 పరీక్షలకు సంబంధించి అభ్యర్థులు ఫీజులు చెల్లించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎం. వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఒక పేపర్‌కు రూ. 100, రెండు పేపర్లకు రూ. 150 చొప్పున ఈ నెల 27లోపు ఫీజు చెల్లించాలని, రూ. 60 ఆలస్య రుసుముతో డిసెంబరు 2 వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నెల 18 నుంచి బీఎస్‌ఈ ఏపీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయన్నారు. అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను సంబంధిత డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement