రెండో దశలో 121 పంచాయతీల ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

రెండో దశలో 121 పంచాయతీల ఎన్నికలు

Nov 19 2026 12:37 PM | Updated on Nov 19 2026 12:37 PM

రెండో దశలో 121 పంచాయతీల ఎన్నికలు అత్యాచారయత్నం కేసులో నిందితుడి అరెస్ట్‌

గణపవరం: పశ్చిమ గోదావరి జిల్లాలో రెండో దశలో 121 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నట్లు జిల్లా పరిషత్‌ సీఈవో జి.వెంకటరమణ తెలిపారు. బుధవారం ఆయన గణపవరం సచివాలయంలోని నామినేషన్‌ కేంద్రాన్ని సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ నెల 20వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని ఆయన తెలిపారు. నామినేషన్లు స్వీకరించే సమయంలో ఒకటికి రెండుసార్లు పరిశీలించి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నామినేషన్‌ కేంద్రంలో ఏర్పాట్లు, హెల్ప్‌లైన్‌, ప్రథమ చికిత్సా కేంద్రం, ఇతర వసతులను పరిశీలించి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. నామినేషన్‌ వేయడానికి వచ్చే అభ్యర్థులకు తగిన సూచనలు ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ నూకల రంగలక్ష్మి, ఎంపీడీవో రంగనాయకులు, పంచాయతీ కార్యదర్శి డి. శివరామప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

కై కలూరు : దొడ్డిపట్ల పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న నర్సుపై మంగళవారం అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితుడు ఆత్మకూరి నరసింహారావు (27)ను బుధవారం అరెస్టు చేసినట్లు రూరల్‌ ఎస్సై వి. రాంబాబు తెలిపారు. గతంలో ఇతనిపై నందివాడ, కైకలూరు రూరల్‌ పోలీస్‌ స్టేషన్లలో పేకాట, ఆత్మహత్యాయత్నం కేసులు ఉన్నాయన్నారు. మద్యానికి బానిసైన ఇతను, మద్యం మత్తులో నర్సుపై అనుచితంగా ప్రవర్తించాడని వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌ విధించినట్లు ఎస్సై పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement