తణుకు అర్బన్: అర్నబ్ తుపాను ప్రభావంతో నేలకొరిగిన 150 ఏళ్ల నాటి రావిచెట్టుకు నెస్ట్ కన్జర్వేషన్ సొసైటీ బృందం చేసిన ప్రయత్నంతో పునర్జన్మ లభించింది. తణుకు కేశవస్వామి ఆలయం వద్ద ఉన్న ఈ చెట్టు తుపాను గాలులకు నేలకూలగా, రహదారి క్లియరెన్స్ పనుల్లో భాగంగా కొమ్మలను తొలగించి మొదలు వరకు ఉంచారు. మునిసిపల్ కమిషనర్ టి. రామ్‌కుమార్ సూచనలతో, రంగంలోకి దిగిన సొసైటీ బృందం ఈనెల 7న ఆ చెట్టు మొదలును భారీ క్రేన్ సహాయంతో ఎన్టీఆర్ పార్కుకు తరలించి నాటింది. నాటే సమయంలో రూటెక్స్, కాపర్ సల్ఫేట్ వంటి ఎరువులను ఉపయోగించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ బృందం చేసిన కృషి ఫలించి, ఆ చెట్టు మొదలు చిగురించి ఆకులు మొలిచాయి. కమిషనర్ సహకారంతోనే ఇది సాధ్యమైందని సభ్యులు మనీష్, బాబి, సాయి, భార్గవి తెలిపారు.


