గోవింద దీక్షాధారులకు శ్రీవారి దేవస్థానం ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. ఉచిత దర్శనంతో పాటు తీర్థప్రసాదాలు, అన్నప్రసాదాన్ని అందిస్తోంది. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎంతో వెసులుబాటు కలుగుతోంది. నియమ నిష్ఠలతో దీక్షను పూర్తిచేసిన వారికి ఆత్మవిశ్వాసం, మానసిక ప్రశాంతత లభిస్తాయి.
– మిడతా ఆంజనేయులు, గురుస్వామి, గుండుగొలనుకుంట
దీక్షాధారులు నిత్యం గోవింద నామస్మరణలో గడపాలి. ఆహార నియమాలు పాటిస్తూ సత్ప్రవర్తనతో మెలగాలి. స్వామిని మనసారా స్మరిస్తూ చేసే పూజలు భక్తుల్లో ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తాయి. ఇప్పటికే స్థానికులతో పాటు ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన అనేక మంది భక్తులు ఈ దీక్షను చేపట్టారు.
– గువ్వల మావుళ్లు, గురుస్వామి, ద్వారకాతిరుమల
దీక్షాధారులు నిత్య పూజలు, గోవింద నామస్మరణతో పాటు క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని అలవర్చుకోవాలి. 41 రోజుల మండల దీక్ష చేపట్టలేని భక్తులు ఈ నెల 29న ప్రారంభమయ్యే 21 రోజుల అర్ధమండల దీక్షను స్వీకరించేందుకు సిద్ధం కావాలి. దీక్ష చేపట్టిన ప్రతి ఒక్కరూ నిర్దేశిత నియమాలను కచ్చితంగా పాటించాలి.
– బొంతు నరసింహారావు, గురుస్వామి, వెంకటకృష్ణాపురం


