భయంగా ఉంది | - | Sakshi
Sakshi News home page

భయంగా ఉంది

Nov 18 2026 1:14 AM | Updated on Nov 18 2026 1:14 AM

భయంగా ఉంది రూ.4 లక్షల వరకు నష్టం చేతికొచ్చిన పంట కుళ్లిపోయింది

నేను 4 ఎకరాలలో రొయ్యలు, చేపలు పెంచుతున్నాను. గత తుపాన్లకు 2 ఎకరాలలో రొయ్యల చెరువు మునిగిపోయి రొయ్యలు వెళ్లిపోయాయి. చేపల చెరువు గట్లు గాలులకు కొట్టుకుపోవడంతో మెస్‌లు కట్టి కాపాడుకున్నాను. ఇప్పుడు మరో తుపాను వస్తుందంటే భయమేస్తోంది. – పెనుమాల నరసింహస్వామి, ఆక్వా రైతు, గొల్లవానితిప్ప

నేను 3 ఎకరాలలో చేపలు పెంచుతున్నాను. 100 గ్రాముల సైజు వచ్చాక అమ్ముతుంటాను. పెట్టుబడులు పోను కొంత మిగులుతుంది. ఈ దఫా తుపాన్లు, భారీ వర్షాలకు చెరువు మునిగి చేపలు వెళ్లిపోయాయి. సుమారు రూ.4 లక్షల వరకు నష్టం వచ్చి అప్పులపాలయ్యాను.

– వాటాల విజయకృష్ణ, ఆక్వా రైతు, నాగేంద్రపురం

నేను కౌలుకు 7 ఎకరాలలో వరి సాగు చేశాను. పంట కోత సమయంలో తుపాన్లు వచ్చి ముంచేశాయి. మొత్తం పెట్టుబడి రూ.3 లక్షలకు పైగా నష్టపోయాను. ఈసారైనా అప్పులు తీరిపోతాయని ఆశపడ్డా. కానీ తుపాన్లు కష్టాల్లో ముంచేశాయి.

– గంగిరెడ్డి లక్ష్మణేశ్వరరావు, కౌలు రైతు, యనమదుర్రు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement