కార్తీక మాసోత్సవాల ఏర్పాట్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

కార్తీక మాసోత్సవాల ఏర్పాట్ల పరిశీలన

Nov 18 2026 1:14 AM | Updated on Nov 18 2026 1:14 AM

కార్తీక మాసోత్సవాల ఏర్పాట్ల పరిశీలన

జంగారెడ్డిగూడెం (బుట్టాయగూడెం): గురవాయిగూడెంలోని శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దేవస్థానాన్ని రాజమహేంద్రవరం దేవదాయ ధర్మదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్‌ (ఆర్జేసీ) వేండ్ర త్రినాథరావు మంగళవారం సందర్శించారు. ఆలయంలో జరుగుతున్న కార్తీక మాస మహోత్సవాల ఏర్పాట్లను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లు, అన్నప్రసాద వితరణ, తాగునీరు తదితర మౌలిక వసతుల కల్పనపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న ఆయనకు అర్చకులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌, ఈవో ఆర్‌వీ చందన ఆయనను శాలువాతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement