సుబ్బారాయుడికి ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

సుబ్బారాయుడికి ప్రత్యేక పూజలు

Nov 18 2026 1:14 AM | Updated on Nov 18 2026 1:14 AM

సుబ్బారాయుడికి ప్రత్యేక పూజలు మద్ది క్షేత్రం.. భక్తజన సంద్రం బైండోవర్‌ ఉల్లంఘించిన వ్యక్తికి జైలు శిక్ష

ముదినేపల్లి రూరల్‌: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్‌లోని శ్రీవల్లీదేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకాలు చేయించేందుకు మంగళవారం భక్తులు భారీ ఎత్తున బారులు తీరారు. జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఉదయానికే ఆలయానికి చేరుకుని, స్వామివారి పుట్టలో పాలుపోసి దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు తోలేటి వీరభద్రశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాలపొంగళ్ల శాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. అలాగే నాగబంధాల వద్ద, గోశాలలో గోవులకు పసుపు–కుంకుమలతో పూజలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ ఈవో ఆర్‌.గంగాశ్రీదేవి, చైర్మన్‌ బొంగు రవికుమార్‌, పాలకవర్గ సభ్యులు నిత్యాన్నదాన ప్రసాదానికి తగిన ఏర్పాట్లు చేశారు.

జంగారెడ్డిగూడెం (బుట్టాయగూడెం): కార్తీక మాసం రెండవ మంగళవారం సందర్భంగా గురవాయిగూడెంలోని శ్రీ మద్ది ఆంజనేయస్వామివారి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. చుట్టుపక్కల గ్రామాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి సుమారు 40 వేల మంది భక్తులు తరలివచ్చి, స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలతోపాటు దేవస్థానంలోని ఉసిరి చెట్టు వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం 3:30 గంటల వరకు వివిధ సేవల ద్వారా దేవస్థానానికి రూ.7,80,902 ఆదాయం సమకూరినట్లు ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌, కార్యనిర్వహణాధికారిణి ఆర్‌వీ చందన తెలిపారు. ఆలయ నిత్యాన్నదాన సత్రంలో 14 వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపారు. అలాగే, మహంకాళి రంగప్రసాద్‌ ఆధ్వర్యంలో లక్కవరం గ్రామస్తుల సహకారంతో ఉచిత అన్నసమారాధన నిర్వహించారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా పోలీసులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

చాట్రాయి: బైండోవర్‌లో ఉన్న వ్యక్తిని వేరే కేసులో అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు నూజివీడు రూరల్‌ సీఐ నాగేంద్ర కుమార్‌ తెలిపారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. బైండోవర్‌లో ఉన్న వ్యక్తి తిరిగి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కేసు నమోదు చేసి కోర్టుకు తరలించగా, న్యాయస్థానం జైలు శిక్ష విధించిందన్నారు. బైండోవర్‌లో ఉన్నవారు ఎవరైనా మళ్లీ నేరాలకు పాల్పడితే జైలు శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. సమావేశంలో ఎస్సై డి.రామకృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement