ఎరువుల సక్రమ పంపిణీకే ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ | - | Sakshi
Sakshi News home page

ఎరువుల సక్రమ పంపిణీకే ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌

Nov 17 2026 12:38 AM | Updated on Nov 17 2026 12:38 AM

నూజివీడు: ఎరువులను రైతులకు సక్రమంగా, పారదర్శకంగా పంపిణీ చేసేందుకే కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ను తీసుకువచ్చిందని జిల్లా వ్యవసాయాధికారి షేక్‌ హబీబ్‌ బాషా పేర్కొన్నారు. నూజివీడు నియోజకవర్గంలోని నాలుగు మండలాల రైతు సేవా కేంద్రం సిబ్బందికి సోమవారం స్థానిక ఏడీఏ కార్యాలయంలో ఈ యాప్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హబీబ్‌ బాషా మాట్లాడుతూ ఈ నెల 17 నుంచి రైతులు తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, కావాల్సిన ఎరువులను బుక్‌ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కౌలు రైతులు సైతం తమ ఆధార్‌, మొబైల్‌ నంబర్లతో లాగిన్‌ అయ్యి, కౌలుకు చేస్తున్న భూమి వివరాలను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. యాప్‌ వినియోగంపై రైతులకు ఆర్‌ఎస్‌కే సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే, నూజివీడు ఏడీఏ కార్యాలయంలో ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ మానిటరింగ్‌ సెల్‌ ఏర్పాటు చేసి ఏవో టెక్నికల్‌ను నియమించామని, యాప్‌పై ఏవైనా సందేహాలు ఉంటే 94401 71020 నంబరులో సంప్రదించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ జొన్నలగడ్డ భవాని, నూజివీడు, ముసునూరు, చాట్రాయి ఏవోలు పలగాని చెన్నారావు, ఆలూరి చాముండేశ్వరి, బండారు శివశంకర్‌, ఎరువుల డీలర్లు, సొసైటీ సెక్రటరీలు, రైతు సేవా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

ఏలూరు జిల్లా వ్యవసాయాధికారి

షేక్‌ హబీబ్‌ బాషా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement