ఈపీఎఫ్‌ కనీస పింఛన్‌ రూ.7,500కు పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ఈపీఎఫ్‌ కనీస పింఛన్‌ రూ.7,500కు పెంచాలి

Nov 17 2026 12:38 AM | Updated on Nov 17 2026 12:38 AM

ఏలూరు (టూటౌన్‌): గుజరాత్‌లో జరగనున్న ఈపీఎఫ్‌ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ (సీబీటీ) సమావేశంలో పార్లమెంటరీ కమిటీ సిఫార్సుల మేరకు ఈపీఎఫ్‌ కనీస పింఛను రూ.7,500కు పెంచాలని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి యు.వెంకటేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కనీస పింఛను పెంచాలని కోరుతూ ఈపీఎఫ్‌ పెన్షనర్ల సంక్షేమ సంఘం (ఐఎఫ్‌టీయూ) ఆధ్వర్యంలో సోమవారం ఏలూరు కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా కేంద్రం కేవలం రూ.1,000 నామమాత్రపు పింఛను ఇస్తూ కార్మికులకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. దాదాపు రూ.10 లక్షల కోట్ల ఈపీఎఫ్‌ నిధులు ఉన్నప్పటికీ, కనీసం వాటిపై వచ్చే వడ్డీని కూడా పింఛన్లుగా చెల్లించకపోవడం దారుణమన్నారు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన కార్మికులకు తక్షణమే పింఛను పెంచాలని కోరారు. ధర్నా అనంతరం నాయకులు జిల్లా రెవెన్యూ అధికారికి (డీఆర్వో) వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేవీ రమణ, బద్దా వెంకటరావు, నగర అధ్యక్షుడు బి. సోమయ్య, పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు కోసూరు నూకరాజు, నాయకులు బుద్ధా నాగేశ్వరరావు, కింతల చిట్టయ్య, బుడుమూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement