జనసేన నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక | - | Sakshi
Sakshi News home page

జనసేన నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక

Nov 17 2026 12:38 AM | Updated on Nov 17 2026 12:38 AM

తణుకు అర్బన్‌: జనసేనకు చెందిన పైడిపర్రు వాసి ఇర్రింకి నాగ సుబ్రహ్మణ్యం (బాలు) సోమవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. పైడిపర్రులోని పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, చైర్మన్‌ అభ్యర్థి యిండుగపల్లి బలరామకృష్ణ (బలరామ్‌) నివాసంలో నాయకుడు పోతాబత్తుల త్రినాథ్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. బలరామకృష్ణ, పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి కలిసి బాలుకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ శ్రేణులు ఆయనకు అభినందనలు తెలిపాయి. కార్యక్రమంలో పబ్లిసిటీ వింగ్‌ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్‌, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు కలిశెట్టి ప్రకాష్‌, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement