చైర్మన్లుగా పనిచేసింది వీరే.. | - | Sakshi
Sakshi News home page

చైర్మన్లుగా పనిచేసింది వీరే..

Nov 16 2026 1:26 AM | Updated on Nov 16 2026 1:26 AM

చైర్మన్లుగా పనిచేసింది వీరే..

గూడెంలో ఇప్పటివరకు ఏడుగురు మున్సిపల్‌ చైర్మన్లుగా పనిచేశారు. 2019 నుంచి ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. తొలి చైర్మన్‌గా డాక్టర్‌ కోడే వెంకట్రావు, ఆయన తర్వా త ఈలి ఆంజనేయులు (1967–72) పనిచేశారు. 1972–1981 వరకు ప్రత్యేకాధికారుల పాలన సాగింది. 1981లో మరలా ఈలి ఆంజనేయులు మున్సిపల్‌ చైర్మన్‌గా పదవి చేపట్టారు. 1982లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడంతో కౌన్సిలర్లతో కలిసి ఆయన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో చేరిన తొలి మున్సిపల్‌ చైర్మన్‌గా రికార్డులకెక్కారు. దీంతో 1983లో కర్రి సోమేశ్వరరావు మున్సిపల్‌ చైర్మన్‌ అయ్యి 1985 వరకు పనిచేశారు. ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టడంతో ఈలి వెంకటసత్యనారాయణ (ఈవీఎస్‌) చైర్మన్‌ అ య్యారు. పదవీ కాలం ముగిసిన తర్వాత తిరిగి రెండోసారి మున్సిపల్‌ చైర్మన్‌ అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ చైర్మన్‌ చాంబర్‌ అధ్యక్షునిగా కూడా పనిచేశారు. వీరి తర్వాత ఓసీ జనరల్‌ కేటగిరీలో దేవతి పద్మావతి చైర్‌పర్సన్‌గా పనిచేశారు. తర్వాత బీసీ జనరల్‌ కేటగిరీకి చెందిన కరణం అప్పారావు పనిచేశారు. తర్వాత ఓసీ వర్గానికి చెందిన ఈతకోట భీమశంకరరావు (తాతాజీ), 2014–2019 వరకు బొలిశెట్టి శ్రీనివాసు చైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం అన్‌రిజర్వుడ్‌ కేటగిరీలో చైర్మన్‌ ఎన్నిక జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement