పెనుగొండ : జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. ఆదివారం పెనుగొండ మండలం సిద్ధాంతం, పెనుమంట్ర మండలం ఆలమూరు పంచాయతీల్లో నామినేషన్ల ప్రక్రియను ఆమె పరిశీలించారు. తొలి విడతలో 90 పంచాయతీలు, 1000 వార్డుల్లో ఎన్నికలు జరగనుండగా 1,062 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. నామినేషన్ల స్వీకరణలో ఎన్నికల నియమావళి తప్పనిసరిగా పాటించాలని, ప్రతి నామినేషన్ను క్షుణ్ణంగా పరిశీలించి స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. రిటర్నింగ్ అఽధికారులు కె.కృష్ణయ్య, ఉంగరాల నాగేశ్వరరావు, తహసీల్దార్ జి.అనితకుమారి, ఎంపీడీఓ టి.సూర్యనారాయణ మూర్తిలు పాల్గొన్నారు.


