‘విల్లు’వెత్తిన ఉత్సాహం | - | Sakshi
Sakshi News home page

‘విల్లు’వెత్తిన ఉత్సాహం

Oct 5 2026 1:27 AM | Updated on Oct 5 2026 1:27 AM

భీమవరంలో రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలు

భీమవరంలో రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలు

ఆర్చరీ పోటీల్లో తలపడుతున్న క్రీడాకారులు

రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలు ఉత్సాహంగా జరిగా యి. భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్‌ ఆర్చరీ అ సోసియేషన్‌, వెస్ట్‌ గోదావరి డిస్ట్రిక్ట్‌ ఆర్చరీ అసోసియేషన్‌ సంయుక్తంగా నిర్వహించారు. విజేతలు వచ్చేనెలలో సిక్కింలో జరిగే జాతీయస్థాయి పోటీలకు హాజరుకానున్నారు. ఆదివారం జరిగిన సీనియర్‌ ఇండియన్‌ రౌండ్‌ ఉమెన్‌ విభాగంలో చిత్తూరుకు చెందిన కె.సాయి సుజియ, కె.మోక్ష, కరణి లోహితరెడ్డి మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. నాలుగో స్థానంలో వైఎస్సార్‌ కడపకు చెందిన చింతపల్లి గ్రీష్మ సాయిశ్రీ నిలిచింది. సీనియర్‌ రికర్వ్‌ ఉమెన్‌ విభాగంలో కృష్ణా జిల్లాకు చెందిన కొండపావులూరి ఉత్కశ్రీ, కుండేరు చంద్రహాస్ని, తాడిబోయిన వైష్ణవి, ఆకుల రవళి మొదటి నాలుగు స్థానాల్లో నిలిచారు. కళాశాల ప్రిన్సిపాల్‌ కేవీ మురళీ కృష్ణంరాజు, ఏపీ ఆర్చరీ అసోసియేషన్‌ అధ్యక్షుడు చెరుకూరి సత్యనారాయణ, ప్రౌడ్‌ ఫాదర్‌ సీనియర్‌ జడ్జి బి.శ్రావణ్‌కుమార్‌, ఆర్చరీ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి బి.వెంకటరమణ, జిల్లా అధ్యక్షుడు ఎల్‌.జయరాజు, కోచ్‌లు పాల్గొన్నారు.

– భీమవరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement