యూపీఐ చార్జీలపై మండిపాటు | - | Sakshi
Sakshi News home page

యూపీఐ చార్జీలపై మండిపాటు

Sep 17 2026 2:26 AM | Updated on Sep 17 2026 2:26 AM

యూపీఐ చార్జీలపై మండిపాటు మహిళల ఆరోగ్యం కీలకం రేపు ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌ నేటి నుంచి గ్రీన్‌ టీచర్లకు శిక్షణ విద్యార్థులకు సైన్స్‌ పోటీలు

భీమవరం: యూపీఐ చార్జీల వసూలుకు కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తక్షణం ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్‌వీ గోపాలన్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక ప్రకాశం చౌక్‌లో నిరసన తెలిపి ఆయన మాట్లాడుతూ వచ్చేనెల 15 నుంచి రూ.2 వేలు పైనే జరిగే యూపీఐ పేమెంట్స్‌పై చార్జీల వసూలుతో వినియోగదారులపై భారం పతుతుందన్నారు. 2016 లో కేంద్ర ప్రభుత్వం నోట్లు రద్దు చేసి ప్రజలంతా డిజిటల్స్‌ పేమెంట్స్‌ అలవాటు చేసుకోవాలని పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో అందరూ ఈ దిశగా అలవాటు పడ్డారన్నారు. ఏడాదికి సుమారు రూ.లక్ష కోట్ల యూపీఐ పేమెంట్స్‌ జరుగుతున్నాయన్నారు. ఫోన్‌పే, గూగుల్‌పే వంటి కంపెనీలన్నీ అమెరికాకు చెందినవే కావడంతో ఇక్కడ యూపీఐ చార్జీల సొమ్ము ఆయా కంపెనీలకు వెళుతుందన్నారు. ప్రజలపై భారం వేసి అమెరికాకు దోచిపెట్టే నిర్ణయాన్ని అందరూ వ్యతిరేకించాలన్నారు. నాయకులు బి.వాసుదేవరావు, ఎం.వైకుంఠరావు, ఎం. ఆంజనేయులు, వేండ్ర సత్యనారాయణ, మునియ్య పాల్గొన్నారు.

ఆకివీడు: మహిళల ఆరోగ్యమే సమాజానికి శ్రేయస్కరమని జాయింట్‌ కలెక్టర్‌ కల్పశ్రీ అన్నారు. స్థానిక ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌, లయన్స్‌ క్లబ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని శ్రీరామరాజు ఆస్పత్రిలో ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఎంఏ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ సర్వేకల్‌ క్యాన్సర్‌ను నిరోధించేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ విద్యార్థినులకు ఉచితంగా వేయడం అభినందనీయమన్నారు. ఐఎంఏ శాఖ అధ్యక్షురాలు డాక్టర్‌ కనుమూరు మాధవి మాట్లాడుతూ గ ర్భాశయ క్యాన్సర్‌ను ముందుగా అరికట్టేందుకు వ్యాక్సిన్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసు కువచ్చిందన్నారు. లయన్స్‌ జిల్లా మాజీ గవర్నర్‌ డాక్టర్‌ ఎంవీ సూర్యనారాయణరాజు మా ట్లాడుతూ లయన్స్‌ క్లబ్‌, ఐఎంఏ సేవలను వివరించారు. లయన్స్‌ జిల్లా గవర్నర్‌ సుబ్బారావు, ఎన్‌వీవీ పాపారావునాయుడు, సీహెచ్‌ కృష్ణంరాజు, ఆర్‌వీ సూర్యనారాయణరాజు, ప్రతాప్‌కుమార్‌, సీఐ కాళీ చరణ్‌, డాక్టర్లు నిలోఫర్‌, అలేఖ్య పాల్గొన్నారు. 150 మంది విద్యార్థినులకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వేశారు.

నరసాపురం: ఒక నెల ఒక నియోజకవర్గం.. నాలుగు పర్యటనలు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నరసాపురం నియోజకవర్గానికి సంబంధించి మొగల్తూరు ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా తెలియజేయవచ్చన్నారు.

భీమవరం: జిల్లాలోని గ్రీన్‌ టీచర్లకు పాఠశాలల్లో పర్యావరణ కార్యక్రమాల నిర్వహణపై గురు, శుక్రవారాల్లో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు ఏపీఎస్‌జీసీ జిల్లా కో–ఆర్డినేటర్‌ ఎన్నేటి రవీంద్ర బుధవారం ప్రకటనలో తెలిపారు. 17న నరసాపురం డివిజన్‌ పరిధిలోని 10 మండలాల గ్రీన్‌ టీచర్స్‌కు తణుకు జెడ్పీ బాలుర పాఠశాలలో, 18న భీమవరం డివిజన్‌ పరిధిలోని 10 మండలాల టీచర్లకు భీమవరం ఏఆర్‌కేఆర్‌ మున్సిపల్‌ పాఠశాలలో శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. టీచర్ల విధులతోపాటు విద్యా సంవత్సరంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలు, ప్రకృతి కనెక్ట్‌ యాప్‌లో ఆయా కార్యక్రమాల వివరాలు అప్‌లోడ్‌ చేయడం, వ్యర్థం అర్థంపై ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో 8,9,10 తర గతుల విద్యార్థులకు నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సై న్స్‌ మ్యూజియం, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇండియన్‌ ఎనర్జీ బాస్కెట్‌ 2047– ప్రా స్పెక్ట్స్‌ అండ్‌ ఛాలెంజెస్‌ అనే అంశంపై నేషనల్‌ సైన్స్‌ సెమినార్‌ నిర్వహించనున్నట్టు జిల్లా సైన్స్‌ అధికారి ఎస్‌వీఎస్‌ సోమయాజులు ప్రకటనలో తెలిపారు. బుధవారం పాఠశాల స్థాయి లో నిర్వహించిన ఈ పోటీల్లో ప్రతిభ చూపిన ఇద్దరు విద్యార్థులను గురువారం మండల స్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక చేస్తారన్నా రు. మండల స్థాయిలో ప్రతిభ చూపిన ఇద్దరు విద్యార్థులను 18న ఏలూరు ఈదర సుబ్బమ్మదేవి నగరపాలక హైస్కూల్‌ నిర్వహించే జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement