శోకసంద్రంలో ఏలూరు | - | Sakshi
Sakshi News home page

శోకసంద్రంలో ఏలూరు

Sep 17 2026 2:26 AM | Updated on Sep 17 2026 2:26 AM

ఏలూరు టౌన్‌: మాజీ మంత్రి ఆళ్ల నాని అకాల మరణంతో ఏలూరు నగరం శోకసంద్రంలో మునిగిపోయింది. నగరంపై మూడు దశాబ్దాల పాటు రాజకీయ రంగంలో ఆయన తనదైన ముద్ర వేశారు. ఆయన ఆకస్మిక మరణంతో నగరవాసులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. నాని పార్థీవదేహాన్ని ప్రజ ల సందర్శనార్థం ఆయన స్వగృహంలో ఉంచారు. గురువారం ఉదయం 9 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో నాని అంత్యక్రియలు చేపట్టనున్నారు. రాజకీయాలకు అతీతంగా నాని పార్థీవదేహాన్ని పలువురు సందర్శించి ఘన నివాళి అర్పించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద రాజు తమతో ఆళ్ల నాని సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీలు కవురు శ్రీనివాస్‌, వంక రవీంద్రనాథ్‌, తా డేపల్లి గూడెం నియోజకవర్గ సమన్వయకర్త వడ్డి రఘురాంనాయుడు నివాళులర్పించారు.

మాజీ మంత్రి ఆళ్ల నానికి ఘన నివాళి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement