● లంకలను ముంచుతూ ప్రవాహం
● దిగువన పెరుగుతున్న ఉధృతి
● ముంపులోనే కనకాయలంక కాజ్‌వే
పెనుగొండ మండలం సిద్ధాంతంలో లంక భూముల్లోకి వరద
పెనుగొండ: గోదావరిఽ ఉధృతంగా ప్రహిస్తుంది. సిద్ధాంతంలో గంటగంటకూ వరద నీరు పెరుగుతోంది. మధ్యస్థలంకకు వరద చేరుకోవడంతో కొబ్బరి, అరటి, కూరగాయల తోటలు ముంపు బారినపడ్డాయి. సిద్ధాంతం, నడిపూడి, పెదమల్లం, కోడేరు, భీమలాపురం, కరుగోరుమిల్లిల్లోని పుష్కర ఘాట్లు, స్నానాల రేవులు నీట మునిగాయి. అధికారులు సిద్ధాంతం మధ్యస్థలంకలోకి రాకపోకలను నిషేధించారు. పశువులు మధ్యస్థలంకలో వందాలాదిగా ఉండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు, నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో వెళ్లి పాలను తీసుకొస్తుంటారు. ఒక్కసారిగా గోదావరి ఉధృతి పెరగడంతో రక్షణ ఏర్పాట్లు చేసుకోలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. వరదతో పాముల బెడద ఎక్కువవుతుందని, దీని వల్ల పశునష్టం జరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. అలాగే సిద్ధాంతం ఏటిగట్టుకు చేర్చి ఉన్న లంక భూముల్లోని కూరగాయలు, అరటి, కొబ్బరి, కోకో తోటలు పూర్తిగా నీట మునిగాయి. ఎక్కువ కాలం నీరు నిలిచి ఉంటి తోటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
ఆందోళనలో లంక గ్రామాలు
ఆచంట మండలంలో అధికంగా గోదావరి మధ్యలో ఉన్న లంక గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఆందోళనకు గు రవుతున్నారు. పెదమల్లంలంక, అయోధ్యలంక, పు చ్చల్లంక, మర్రేమూల, కోడేరులంక, అణగారలంకల్లోని పల్లపు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. ఆయా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోవడంతో నిత్యావసర వస్తువులు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వైద్య శిభిరాలు తప్ప ఇతర ఏర్పాట్లు చేయలేదు. ఆయా ప్రాంతాల్లో తా గునీటికి ఇబ్బంది పడుతున్నా కనీసం ప్రభుత్వం చ ర్యలు తీసుకోలేదని బాధితులు వాపోతున్నారు.
ముంపులో అరటి, కొబ్బరి తోటలు
సిద్ధాంతంలో నిండుగా ప్రవహిస్తున్న గోదావరి
నరసాపురం: నరసాపురంలో వశిష్ట గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. మూడు రోజులుగా వరద నీటితో నీటిమట్టం పెరిగింది. వలంధరరేవులో పిండ ప్రదానాలు చేసే షెడ్డును తాకి వరద నీరు చేరి గోదావరి ప్రవహిస్తోంది. గోదావరి మాత విగ్రహం వద్ద నీటిమట్టం పెరిగింది. దీంతో వలంధరరేవులో స్నానాలను నిషేధించారు. పట్టణంలోని ఐదు చోట్ల ఉన్న అవుట్‌ఫాల్ స్లూయిజ్‌ల నుంచి వరద నీరు ఎగదన్నుతోంది. గోదావరి బండ్‌ను ఆనుకుని ఉన్న ప్రాంతాలు రానున్న రెండు రోజుల్లో వరద తాకిడికి గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు పడవల రేవులో పంటు రాకపోకలు వరుసగా మూడో రోజు కూడా నిలుపుదల చేశారు.


