ప్రైవేట్ విద్యాసంస్థల్లో అక్రమంగా విద్యా సామగ్రి విక్రయిస్తున్నా కఠిన చర్యలు తీసుకోవడం లేదు. తమ వద్దనే పుస్తకాలు, యూనిఫాం కొనుగోలు చేయాలనే నిబంధనతో అఽధిక ధరలకు విక్రయిస్తున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ పెద్దలకు చెందినవి కావడంతో చర్యలు అంతంతమాత్రమే.
– పి.సాయికృష్ణ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు
ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యా సామగ్రిని సీజ్ చేస్తున్న అధికారులు వాటిని పేద విద్యార్థులకు పంపిణీ చేయాలి. సీజ్ చేసిన కొన్నిరోజుల తర్వాత తిరిగి ఆయా సంస్థలకు అప్పగించడంతో మళ్లీ విక్రయాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు తప్ప అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట పడటం లేదు.
– బి.సింధు, ఎస్‌ఎఫ్‌ఐ గరల్స్ జిల్లా కన్వీనర్
ప్రైవేటు విద్యాసంస్థల్లో నిబంధనలకు విరుద్ధంగా విద్యా సామగ్రి విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎక్కడైనా పుస్తకాలు, యూనిఫాం వంటివి విక్రయిస్తే మా దృష్టికి తీసుకురావాలి. అన్ని విద్యాసంస్థలు ప్రభుత్వ నియమ, నిబంధనలు తప్పక పాటించాలి.
– ఈ.నారాయణ, డీఈఓ, భీమవరం


