ఆక్వా రైతులను ఫీడ్‌యించుకు తినేలా..! | - | Sakshi
Sakshi News home page

ఆక్వా రైతులను ఫీడ్‌యించుకు తినేలా..!

Jun 14 2026 11:43 AM | Updated on Jun 14 2026 11:43 AM

సబ్సిడీలో షరతులా?

ఆక్వా రైతులను ఆదుకోవాలి

కై కలూరు: ఉమ్మడి జిల్లాలో చేపల సాగు 1.80 లక్షల ఎకరాలు, రొయ్యల సాగు 1.10 లక్షల ఎకరాలు వె రసి 2.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. వా ర్షిక ఉత్పత్తి 4 లక్షల టన్నులు. సాధారణంగా వ నామీ రొయ్యల ఉత్పత్తికి టన్నుకు టన్నున్నర మేత, టైగర్‌ రొయ్యలకు టన్నుకు రెండున్నర టన్నుల మేతను రైతులు వినియోగిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో టన్నుకు రూ.4 వేల చొప్పున ధరలను మేతల కంపెనీలు పెంచేశాయి. తిరిగి ముడిసరుకుల ధరలు పెరిగాయనే సాకుతో టన్నుకు కనీసం వనామీ ఫీడ్‌పై రూ.12 వేలు, టైగర్‌ ఫీడ్‌పై రూ.14 వేలు పెంచేందుకు అవకాశం ఇవ్వాలని రొయ్య మే త తయారీదారులు కోరారు. తర్వాత ఒక్కసారిగా ధరలు పెంచామని ప్రకటించడంతో రొయ్యల రైతు లు ఆందోళన బాట పట్టారు.

ధరలు తగ్గినా రేట్లు తగ్గించలేదు

ఫీడ్‌ తయారీ కంపెనీలు పూర్వం ఫిష్‌మీల్‌, సోయాబిన్‌ వంటి ముడిసరుకుల ధరలు తగినా మేత ధరలను తగ్గించలేదని రైతు సంఘ నాయకులు వాపోతున్నారు. గత నెల 11న వనామీ ఫీడ్‌పై రూ.8,420, టైగర్‌ ఫీడ్‌పై రూ.10,520 చొప్పున పెంచుతూ కంపెనీలు ప్రకటనలు చేశాయి. అప్సడా చట్టం ప్రకారం ఆక్వా రైతులు, సంఘాల నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా నిర్ణయాలు జరిగాయి. దీంతో రొయ్యల రైతులు రోడ్లపై నిరసనలతో పాటు పలు పట్టణాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. మంత్రి అచ్చెన్నాయుడు పరిస్థితిని చక్కదిద్దుతానని చెప్పి నా ఫలితం లేదు. ఇంత జరిగినా శుక్రవారం రొ య్యల మేతల ధరలు పెంచుతూ అధికారిక అనుమతులు కంపెనీలకు చేరాయి.

విద్యుత్‌ సబ్సిడీలోనూ మెలికలే..

ఆక్వా జోన్స్‌తో సంబంధం లేకుండా కూటమి ప్రభు త్వం రాగానే విద్యుత్‌ యూనిట్‌ను రూ.1.50కే సరఫరా, జిల్లాల్లో 5 వేల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన కోల్ట్‌ స్టోరేజీలు, తగ్గింపు ధరలకు ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్సిడీపై ఏరియేటర్లు అందిస్తామని ఎన్నికల సమయంలో నేతలు వాగ్దానాలు చేశారు. రెండేళ్ల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడటంతో మెలికలు పెట్టి యూనిట్‌ రూ.1.50కి అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఏలూరు జిల్లా లో మొత్తం 13,007 ఆక్వా విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నా యి. వీటిలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 9,555 కనెక్షన్లకు విద్యుత్‌ సబ్సిడీ అందించారు. చంద్ర బాబు ప్రభుత్వంలో ప్రస్తుతం 3,452 మంది రైతులకు సబ్సిడీ వర్తింపజేయాలి. ఇదిలా ఉంటే పవర్‌ ఫ్యాక్టర్‌ (విద్యుత్‌ వినియోగ నాణ్యత) 0.90 నుంచి 0.95 శాతం మధ్య ఉండాలని ప్రభుత్వం షరతు పె డుతూ 169 జీఓను విడుదల చేసింది. దీనిపై ఆక్వారైతుల్లో అధిక శాతం మందికి అవగాహన లేదు. లబ్ధిదారులను తగ్గించే ఎత్తుగడగా పలువురు భావిస్తున్నారు.

ఏఐ సృష్టించిన చిత్రం

ఏఐ సృష్టించిన చిత్రం

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఎటువంటి షరతులు లేకుండా ఆక్వాలో విద్యుత్‌ సబ్సిడీ అమలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం పవర్‌ ఫ్యాక్టర్‌ అంశాన్ని తెరపైకి తెచ్చింది. రొయ్యల రైతులు రూ.వేలల్లో చెల్లించి అద్దె జనరేటర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. మేత తయారీదారుల పక్షానే ప్రభుత్వం నిలవడం శోచనీయం.

– రామిశెట్టి సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ సెక్రటరీ, ముదినేపల్లి

రాష్ట్రానికి అత్యధిక ఆదాయం అందిస్తున్న ఆక్వారంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఇప్పటికే సరైన నీటి వనరులు లేక సాగులో వ్యాధులు ప్రబలుతున్నాయి. రొయ్యల రైతులు అప్పులు చేసి సాగు చేస్తున్నారు. పెంచిన మేతల ధరలను తగ్గించాలి. షరతులు లేకుండా అందరికీ ఆక్వా సబ్సిడీ వర్తింపజేయాలి.

– చేబోయిన వీరరాజు, వైఎస్సార్‌సీపీ,

ఏలూరు జిల్లా ఉపాధ్యక్షుడు, మండవల్లి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement