పీడీఎస్‌ బియ్యం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

పీడీఎస్‌ బియ్యం పట్టివేత

Apr 2 2026 12:12 PM | Updated on Apr 2 2026 12:12 PM

పీడీఎస్‌ బియ్యం పట్టివేత మోటార్‌సైకిళ్లు ఢీకొని వ్యక్తి మృతి రోడ్డు ప్రమాదంలో సర్పంచ్‌కు గాయాలు పాముకాటుకు వ్యక్తి మృతి యువతి అదృశ్యంపై కేసు నమోదు

బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం పి. అంకంపాలెం సమీపంలో పీడీఎస్‌ బియ్యంను అక్రమంగా తరలిస్తున్న వ్యాన్‌ను బుధవారం పట్టుకుని సీజ్‌ చేసినట్లు ఎస్సై క్రాంతి కుమార్‌ తెలిపారు. పేదలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పీడీఎస్‌ బియ్యంను తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు డిప్యూటీ తహసీల్దార్‌, వీఆర్‌ఓల సమక్షంలో పట్టుకున్నట్లు తెలిపారు. మొత్తం 50 కేజీల పరిమాణం గల 60 బస్తాలు వ్యాన్‌లో ఉన్నాయన్నారు. బియ్యంను అక్రమంగా రవాణా చేస్తున్న కె.సురేష్‌ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

రేషన్‌ బియ్యం బస్తాలు స్వాధీనం

పెదపాడు: రేషన్‌ బియ్యం అక్రమ నిల్వలను పెదపాడు పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మండలంలోని కొత్తూరు గ్రామంలో రేషన్‌ బియ్యం అక్రమ నిల్వ చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఎస్సై ఆర్‌.శ్రీనివాస్‌ తన సిబ్బందితో కలిసి చితాడ పవిత్ర కుమార్‌ గోడౌన్‌పై దాడి చేసి బియ్యం నిల్వలను స్వాధీనం చేసుకుని అతడిపై కేను సమోదు చేశారు.

చింతలపూడి: ఎదురెదురుగా రెండు మోటార్‌సైకిళ్లు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాఘవాపురం గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే సమీపంలో ముగ్గురు యువకులు బైక్‌పై రాఘవపురం నుంచి అతివేగంతో వెళ్తున్నారు. అదే సమయంలో సత్తుపల్లి నుంచి ద్విచక్రవాహనంపై చింతలపూడి వైపు వస్తున్న తెడ్లం గ్రామానికి చెందిన గంజి రాధ (35)ను వారు ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో రాధ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన యువకులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రాధ మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఎస్సై కె సతీష్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కుక్కునూరు: రోడ్డు ప్రమాదంలో ఓ సర్పంచ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం అనంతరం కివ్వాక పంచాయతీ సర్పంచ్‌ మడివి రాజులు తన టీవీఎస్‌ ఎక్సెల్‌ వాహనంపై పెట్రోల్‌ బంక్‌ వద్దకు వెళ్లి తిరిగి వెనక్కి వస్తుండగా స్పోర్ట్స్‌ బైక్‌ పై వేగంగా వచ్చిన యువకుడు బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సర్పంచ్‌ రాజులు కాలి ఎముక విరిగిపోగా, తలకు తీవ్ర గాయమైంది. దీంతో స్థానికులు 108 వాహనంలో స్థానిక పీహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం భద్రాచలం ఆస్పత్రికి తరలించారు.

ఉంగుటూరు: పాము కాటుతో వ్యక్తి మృతి చెందిన ఘటన నీలాద్రిపురంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం గ్రామానికి చెందిన తాళ్ల సుబ్బారావు (35) బుధవారం పొలంలో మెక్కజొన్న చేలో పొత్తులు విరుస్తుండగా కాలుమీద పాము కాటు వేసింది. దాంతో స్థానికులు అతడిని వెంటనే తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సుబ్బారావుకు భార్య భవాని, పిల్లలు ఉన్నారు.

జంగారెడ్డిగూడెం: స్థానిక మార్కండేయపురానికి చెందిన యువతి (20) అదృశ్యంపై పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్సై ఎన్‌వీ ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం యువతి గతంలో కిరాణా షాపులో పనిచేసేదని, అక్కడ మానివేసి ఇంటి వద్దే ఉంటోందని తెలిపారు. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement