అందరి కృషితోనే..
కార్గో డోర్ డెలివరీ మాసోత్సవంలో భాగంగా రీజియన్‌లో అత్యధిక బుకింగ్స్ చేసిన డిపో తణుకు అవ్వడం చాలా సంతోషంగా ఉంది. డీపీటీవో వరప్రసాద్ నిరంతర పర్యవేక్షణ, వినియోగదారులు గిఫ్ట్ స్కీం, స్పాన్సర్స్ సహకారం, కార్గో డీఎంఈ షేక్ లాల్ నిరంతర కృషితోపాటు కార్గో ఆపరేటర్స్, హమాలీల కష్టంతోనే మొదటి స్థానంలో నిలవగలిగాం. వినియోగదారుల్లో అత్యధిక డీడీలు బుక్ చేసిన లావణ్య ఫీడ్స్ ప్రాప్రెయిటర్ కోసూరి సతీష్ వర్మకు అభినందనలు. – సప్పా గిరిధర్‌కుమార్, తణుకు డిపో మేనేజర్
రీజియన్‌లో పరిధిలో అత్యధిక డోర్ డెలివరీలు చేయగలిగామంటే వినియోగదారులు, కార్గో కేంద్ర సిబ్బంది, హమాలీల కృషే. అధికారుల నిరంతర పర్యవేక్షణతోపాటు నరేష్ క్లాత్ షోరూం, షాలేం పెన్ కార్నర్, డాక్టర్ టీపీఎన్ ప్రసాద్, డాక్టర్ నల్లపాటి అనూషల సహకారంతో నిర్వహించిన గిఫ్ట్ స్కీం కీలకంగా పనిచేసింది. అలాగే సేవలపై విస్తృతస్థాయిలో ప్రచారం కూడా చేశాం.
–షేక్ లాల్, తణుకు ఆర్టీసీ డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్
అందరి కృషితోనే..


