టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభం
పాలకొల్లు సెంట్రల్: సీహెచ్ బుద్ధావతారం రాజు మెమోరియల్ ఆల్ ఇండియా సీనియర్స్ ర్యాంకింగ్ టెన్నిస్ క్వాలిఫై మ్యాచ్‌లు ప్రారంభమైనట్లు స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.బూన్‌రాజు తెలిపారు. శనివారం స్థానిక కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా బూన్ రాజు మాట్లాడుతూ క్వాలిపైయింగ్ మ్యాచ్‌ల్లో 82 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. 10వ తేదీ నుంచి మెయిన్ డ్రాకు ఎంపికై న వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 230 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు. క్రీడాకారులందరికీ వసతి, భోజన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
సాక్షి, భీమవరం: భీమవరం పట్టణంలో బీఎస్‌ఎన్‌ఎల్ కేబుల్ వైర్లు చోరీకి పాల్పడుతున్నట్లుగా అనుమానిస్తున్న ముఠాను శనివారం రాత్రి 11 గంటల సమయంలో వన్‌న్‌టౌనన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత మూడు రోజులుగా పట్టణంలోని తాలూకా ఆఫీసు సెంటర్, చుట్టుపక్కల ప్రాంతాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ అండర్ గ్రౌండ్ కేబుల్ వైర్ల చోరీకి గురవుతున్నట్టు టెలికం సిబ్బంది గుర్తించారు. అనుమానితుల కోసం శనివారం రాత్రి సిబ్బంది పహారా కాశారు. స్థానిక వన్‌న్‌టౌన్‌్ పోలీస్ స్టేషన్ సమీపంలోని త్యాగరాజ భవనం వద్ద తవ్వకాలు చేస్తున్న వారిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దాదాపు 25 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి గునపాలు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో కొందరు మహిళలు ఉన్నట్టు సమాచారం. ఒక వ్యానన్‌లో వచ్చిన వీరంతా అమలాపురం అని కొందరు, మరొక ప్రాంతమని కొందరు పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు తెలిసింది.


