శిశువు మృతదేహం లభ్యం
తాడేపల్లిగూడెం రూరల్: రోడ్డు వెంట మగ శిశువు మృతదేహం లభ్యమైన సంఘటన మండలంలోని చినతాడేపల్లి ఎస్సీ ఏరియాలో చోటు చేసుకుంది. శనివారం రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వారం రోజుల వయసున్న మగ శిశువును క్లాత్‌లో చుట్టబెట్టి పారవేశారు. దీన్ని గుర్తించిన స్థానికులు సమాచారం అందించడంతో రూరల్ ఎస్సై జేవీఎన్. ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మగ శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించి, వీఆర్వో ఎం.శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


