కిటకిటలాడిన శ్రీవారి క్షేత్రం
కార్తీక దీపాలు వెలిగిస్తున్న భక్తులు
శ్రీవారి అనివేటి మండపంలో భక్తుల రద్దీ
ద్వారకాతిరుమల: శ్రీనివాసా గోవిందా.. వెంకటరమణ గోవిందా అంటూ శనివారం వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించారు. దాంతో క్షేత్ర పరిసరాలు సందడిగా మారాయి. స్వామివారికి ప్రీతికరమైన రోజు, అందులోనూ కార్తీక మాస పర్వదినాలు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలవడంతో క్షేత్ర పరిసరాలు కళకళలాడాయి. భక్తులు చేసిన గోవింద నామస్మరణలతో స్వామి సన్నిధి మార్మోగింది. ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతంలోని దీపారాధన మండపం వద్ద పెద్ద ఎత్తున భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు. వేలాది మంది భక్తులు శ్రీవారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అనివేటి మండపంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. క్షేత్రంలో రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగింది.
కిటకిటలాడిన శ్రీవారి క్షేత్రం


