వైఎస్సార్‌సీపీ జెండా దిమ్మ ధ్వంసం
ఆగిరిపల్లి: మండలంలోని ఈదరలో వైఎస్సార్‌సీపీ జెండా దిమ్మను స్థానిక టీడీపీ నాయకుల సహకారంతో ధ్వంసం చేశారని పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ ఈదరలోని నేతాజీ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ పార్టీ జెండా దిమ్మను శుక్రవారం రాత్రి రోడ్డు అభివృద్ధి పనుల సాకుతో రోడ్డుకి చాలా దూరంలో ఉన్న జెండా దిమ్మను ఉద్దేశపూర్వకంగానే కాంట్రాక్టర్‌తో కుమ్మకై ్క స్థానిక సర్పంచ్ భర్త జెండా దిమ్మను ధ్వంసం చేయించారని, ఈదర వైఎస్సార్‌సీపీ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ గోళ్ళ అనూష మాట్లాడుతూ టీడీపీ నాయకులు గ్రామంలో కొత్త సంస్కృతికి తెరలేపుతున్నారని అన్నారు. జెండా దిమ్మను ధ్వంసం చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి, ధ్వంసం చేసిన వారే మళ్లీ అక్కడ జండా దిమ్మను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.


