అక్రమ కేసులు రాజ్యమేలుతున్నాయి
పాలకొల్లు సెంట్రల్: రాష్ట్రంలో అక్రమ కేసులు రాజ్యమేలుతున్నాయని వైఎస్సార్ సీపీ పాలకొల్లు నియోజవర్గ ఇన్‌చార్జి గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి) విమర్శించారు. మాజీ మంత్రి జోగి రమేష్‌పై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని ఆదివారం ఆయన ప్రకటనలో ఖండించారు. బీసీ ఓట్లతో గద్దెనెక్కిన కూటమి సర్కారు ఇప్పు డు బీసీలపైనే అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తుందని ఆరోపించారు. ప్ర భుత్వ పతనం బీసీలతోనే ప్రారంభమవుతుందని హెచ్చరించారు. నారా వా రి పాలనలో అక్రమ మద్యం ఏరులై పారుతుంటే కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో ఊరుకో మానభంగం, ఊరుకో హత్య జరుగుతుందని విమర్శించారు. దుర్మార్గ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని, ఇప్పటికైనా చంద్రబాబు కక్షపూరిత రాజకీయాలు మా నాలని లేకుంటే బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి బుద్ధి చెబుతారని గోపి హెచ్చరించారు.


