రిజిస్టర్ల దొంగలు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

రిజిస్టర్ల దొంగలు అరెస్ట్‌

Nov 3 2025 6:54 AM | Updated on Nov 3 2025 6:54 AM

రిజిస

రిజిస్టర్ల దొంగలు అరెస్ట్‌

రిజిస్టర్ల దొంగలు అరెస్ట్‌ నేడు పీజీఆర్‌ఎస్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కలసిన ఉన్నతాధికారులు అంధ ఉపాధ్యాయులకు టెట్‌ మినహాయించాలి

తాడేపల్లిగూడెం అర్బన్‌: తాడేపల్లిగూడెంలోని లాడ్జీల్లో రిజిస్టర్లు చోరీ చేసిన ఐదుగురు నిందితులను పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం పట్టణ సీఐ బోణం ఆదిప్రసాద్‌ వి వరాలు వెల్లడించారు. కర్నాటకకు చెందిన శరణప్ప గంగప్ప, కార్తీక్‌ ఉమాపతి, ఎన్‌.శశికుమార్‌, రుద్రప్ప, సతివాడ సందీప్‌లు తాడేపల్లిగూడెంలోని వివిధ లాడ్జీల్లో రూములు అద్దెకు తీసుకుని చాకచక్యంగా లాడ్జీలకు సంబంధించిన రిజిస్టర్లను దొంగలించారు. వాటి ఆధారంగా లాడ్జీల్లో బస చేసినవారి ఫోన్‌ నంబర్లు తెలుసుకుని వారికి ఫోన్లు చేసి బంగారం తక్కువ ధరకు విక్రయిస్తామని నమ్మబలికేవారు. తక్కువ ధరకు బంగారం వస్తుందని ఆశతో కొందరు వ్యక్తులు వీరు చెప్పిన ప్రదేశానికి వెళ్లి చూడగా కత్తులు చూపించి వారి వద్ద నుంచి నగదును దొంగలించి పారిపోయేవారు. ఇలా పట్టణానికి చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.40 వేలు చోరీ చేశారు. స్థానిక ఎంవీఆర్‌ లాడ్జి మేనేజర్‌ వీరాబత్తుల వెంకటరత్నం ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టి నిట్‌ కాలేజీ సమీపంలోని హైవేపై నిందితులను అరెస్ట్‌ చేశారు. జల్సాలకు అలవాటు పడిన వీరు కర్నాటక నుంచి మన రాష్ట్రానికి వచ్చి పలు పట్టణాల్లోని లాడ్జీల్లో రిజిస్టర్లు దొంగిలించారని పోలీసులు తెలిపారు. మరింత లోతుగా విచారణ చేపడుతున్నామని, నిందితుల నుంచి రూ.3,510 నగదు, చాకు, కారు, లాడ్జి రిజిస్టర్‌ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. తక్కువ ధరకు బంగారం విక్రయిస్తామని ఫోన్ల ద్వారా మాట్లాడిన వ్యక్తుల వివరాలు తమకు అందజేయాలని సీఐ ఆదిప్రసాద్‌ కోరారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): జిల్లాలోని కలెక్టరేట్‌, డివిజనల్‌, మండల కేంద్రాల్లో సోమవారం ప్ర జా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించాలన్నారు. అలాగే మీ కోసం కాల్‌ సెంటర్‌ 1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రాన్ని ఆదివారం సందర్శించిన సుప్రీంకోర్టు న్యాయ మూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరిని ఆలయ చైర్మన్‌ ఎస్వీ సుధాకరరావుతో పాటు, పలువురు జిల్లాస్థాయి అధికారులు మర్యాదపూర్వకంగా కలిశా రు. చైర్మన్‌ సుధాకరరావు న్యాయమూర్తికి దు శ్శాలువాను కప్పి, స్వామివారి జ్ఞాపికను అందజేశారు. అలాగే ఏలూరు జిల్ల్లా కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి, ఏలూరు రేంజ్‌ డీఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌, జిల్లా ఎస్పీ కొమ్మికిషోర్‌, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి ఆయనకు పూల మొక్కలను అందజేశారు.

ఏలూరు (టూటౌన్‌): అంధ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ దివ్యాంగుల సంక్షేమ సంఘం (ఏపీడీఎస్‌ఎస్‌) ఆదివారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరింది. 2010కి ముందు డీఎస్సీ ద్వారా ని యామకం పొందిన టీచర్లకు కూడా టెట్‌లో మినహాయింపు ఇవ్వాలన్నారు. అంధ ఉపా ధ్యాయులు టెట్‌ కోసం కంప్యూటర్‌ ఎగ్జామ్‌ రాయడం ఇబ్బంది అన్నారు.

రిజిస్టర్ల దొంగలు అరెస్ట్‌ 1
1/1

రిజిస్టర్ల దొంగలు అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement