భక్తులకు రక్షణ కరువు | - | Sakshi
Sakshi News home page

భక్తులకు రక్షణ కరువు

Nov 3 2025 6:54 AM | Updated on Nov 3 2025 6:54 AM

భక్తులకు రక్షణ కరువు

భక్తులకు రక్షణ కరువు

భీమవరం: కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలతో పాటు భక్తులకూ రక్షణ కరువైందని, ప్రభుత్వ అసమర్థతే కారణమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే కవురు శ్రీని వాస్‌ ధ్వజమెత్తారు. భీమవరం ఆదివారం రాత్రి వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. కూటమి పాలనలో భద్రత కరువు, చంద్రబాబు అసమర్థ పాలన నశించాలంటూ నినాదాలు చేశారు. కాశీబుగ్గలో భక్తులు మరణానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని, మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ముదునూరి, కవురు మాట్లాడుతూ కాశీబుగ్గలో ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని, ఆలయాలకు భద్రత కల్పించలేని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రైవేట్‌ ఆలయం అంటూ సాకులు చూపిస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆలయాలైన తిరుపతి, సింహాచలంలో జరిగిన ఘటనలకు బాధ్యులెవరని ప్రశ్నించారు. ప్రచార ఆర్భాటం కోసం పుష్కరాల సమయంలో చంద్రబాబు వికృత చేష్టలతో పలువురు మృత్యువాత పడిన సంఘటనను రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదన్నారు. పార్టీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమల్లి వెంకటరాయుడు, మేడిది జాన్సన్‌, కామన నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలతో పలు ప్రమాదాలు జరుగుతుంటే కూటమి ప్రభుత్వం డైవర్షన్‌ పాలిటిక్స్‌తో ప్రజలను పక్కదోవ పట్టించాలని చూస్తోందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఎంపీపీ పేరిచర్ల విజయనర్సింహరాజు, పార్టీ నాయకులు ఏఎస్‌ రాజు, పాలవెల్లి మంగ, ఇంటి సత్యనారాయణ, చిగురుపాటి సందీప్‌, గుంటి ప్రభు, పెనుమాల నర్సింహస్వామి, మానుకొండ ప్రదీప్‌, రాయవరపు శ్రీనివాసరావు, గంటా రాహుల్‌, సుందరకుమార్‌, కాటం స్టాలిన్‌, పెచ్చెటి ప్రసాద్‌, బి.విజయదుర్గ, బడుగు అశోక్‌ పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement