మద్యం కేసులో జోగి రమేష్‌ అరెస్టు అక్రమం | - | Sakshi
Sakshi News home page

మద్యం కేసులో జోగి రమేష్‌ అరెస్టు అక్రమం

Nov 3 2025 6:54 AM | Updated on Nov 3 2025 6:54 AM

మద్యం కేసులో జోగి రమేష్‌ అరెస్టు అక్రమం

మద్యం కేసులో జోగి రమేష్‌ అరెస్టు అక్రమం

తణుకు అర్బన్‌: రాష్ట్రంలో అక్రమ అరెస్టులు, జైళ్లకు పంపడం తప్ప పరిపాలన గాలికొదిలేసి మీ రెడ్‌బుక్‌ సిద్ధాంతాన్ని అమలుచేస్తున్నారంటూ మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. 16 నెలల కాలంలో రూ.2 లక్షల 40 వేల కోట్లు అ ప్పులు చేసి వాటిని కనిపించకుండా చేసేందుకు అరెస్టుల పర్వానికి తెరతీశారని విమర్శించారు. రూ.3,600 కోట్ల లిక్కర్‌ కేసు అని చెప్పి కొండను తవ్వి ఎలుకను పట్టిన విధంగా కూటమి ప్రభుత్వం వైఖరి ఉందన్నారు. తణుకులోని వైఎస్సార్‌సీపీ కా ర్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు.. బెల్టుషాపులు ఉండకూడదంటూనే బెల్టులు, మ ద్యం దుకాణాల ద్వారా మద్యం విచ్చలవిడిగా విక్రయాలు చేస్తూ రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మా ర్చేశారని విమర్శించారు. ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం బయటపడగానే మాజీ మంత్రి జోగి రమేష్‌ ప్రజలకు వివరించారని గుర్తుచేశారు. దీంతో కక్షపూరితంగా జనార్దనరావుతో పేరు చెప్పించి గౌడ కులస్తుడైన ఆయనపై అభియోగాలు మోపి నేడు అరెస్టు చేశారని మండిపడ్డారు. కల్తీ మద్యం నడుస్తుంటే మీ పోలీసు, ఎకై ్సజ్‌ తదితర డిపార్టుమెంట్లు ఏంచేస్తున్నాయని ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని నిలదీశారు. కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకించినా, అక్రమాలు బయటపెట్టినా అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కూటమి ఎమ్మెల్యేలే దోచేస్తున్నారు

రాష్ట్రవ్యాప్తంగా మీ కూటమి ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరుగుతున్న అవినీతి, అక్రమాల విషయాల్లో వారిని ఎందుకు అరెస్టులు చేయలేకపోతున్నారని మాజీ మంత్రి కారుమూరి ప్రశ్నించారు. ఎమ్మె ల్యేలు యథేచ్ఛగా దోపిడీలు చేస్తున్నారని, మద్యం, బెల్టు షాపులు, ఇసుక, మట్టి, పనికి ఆహార పథకం, పేకాట, క్రికెట్‌ బుకీలు, గంజాయి విక్రయాల్లో దోచేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల ఒక ఎమ్మె ల్యే సైతం పైనుంచి నిధులు రాకపోవడంతో తాము లంచాలు తీసుకుని ఆ డబ్బుతోనే అభివృద్ధి చేస్తు న్నామని చెప్పడానికి కూడా సిగ్గుపడడం లేదని అనడాన్ని గుర్తుచేశారు. రాష్ట్రంలో బాలికలకు చాక్లెట్‌లు, బిస్కెట్‌లు ఇచ్చి అత్యాచారాలు చేస్తుంటే మీ రేం చేస్తున్నారని నిలదీశారు. మీ వాళ్లు ఏ తప్పు చే సినా, ఏ విధ్వంసం చేసినా వారిని ఏ అరెస్టులు చే యరని దుయ్యబట్టారు. బీసీలను లక్ష్యంగా చేసు కుని అరెస్టులకు దిగుతున్నారని మండిపడ్డారు. లీ గల్‌ సెల్‌ సభ్యుడు వెలగల సాయిబాబారెడ్డి మా ట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆశించినట్టు జోగి రమేష్‌ పేరు ఎక్కడా ప్రస్తావన లేదని, కనీసం రిమాండ్‌ రిపోర్టు, విచారణలో కూడా ఆయన పేరు లేకపోయినా అరెస్టు చేశారని మండిపడ్డారు.

కాశీబుగ్గ మృతులకు నివాళి

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 10 మంది భక్తులు మరణించడం బాధాకరమని మాజీ మంత్రి కారుమూరి అన్నారు. ఆలయ ధర్మకర్త ముందురోజే పోలీసులకు బందోబస్తుపై సమాచారం ఇచ్చానని చెబుతున్నారని, కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే భక్తులు మృతిచెందారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మృతులకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, పబ్లిసిటీ వింగ్‌ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్‌, తేతలి మాజీ సర్పంచ్‌ కోట నాగేశ్వరరావు, నియోజకవర్గ మహిళాధ్యక్షురాలు మెహర్‌ అన్సారీ, పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. రాత్రి తణుకు నరేంద్ర సెంటర్‌లో పార్టీ ఆధ్వర్యంలో కాశీబుగ్గ మృతులకు నివాళులర్పిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.

తణుకులో విలేకరుల సమావేశంలో

మాజీ మంత్రి కారుమూరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement