
యువ ఇంజనీర్ల పాత్ర కీలకం
భీమవరం: సమాజ నిర్మాణంలో యువ ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమని నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ ముందుకు సాగాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం భీమవరం డీఎన్నార్ కళాశాలలో నిర్వహించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నేటి ఇంజనీరింగ్ రంగంలో జరుగుతున్న తాజా మార్పులు, సాంకేతిక ఆవిష్కరణల గురించి వివరించారు. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్ధులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎం.అంజన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.