
రోడ్డెక్కిన దస్తావేజు లేఖర్లు
పెదవేగి: తమ సమస్యల పరిష్కారానికి రోడ్డెక్కనున్నట్టు దస్తావేజుల లేఖర్ల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పెనుమాక వెంకట సుబ్బారావు తెలిపారు. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఆయన నేతృత్వంలో జిల్లా స్థాయి లేఖర్లు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఓటీపీ వ్యవస్థను రద్దు చేయాలని, వీలునామాలు రాయించుకున్న వారి ఇళ్లకు వెళ్లి నేరుగా అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకునేలా అనుమతి కల్పించాలని, ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఇచ్చే గ్రాంట్‌ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. దస్తావేజు రాసుకున్న వ్యక్తి రిజిస్ట్రేషన్ కోసం 72 గంటలు సమయం వేచి ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందని, ప్రభుత్వం 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడం సరైంది కాదన్నారు. పెన్ డౌన్ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 294 రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో దస్తావేజు లేఖర్లంతా శుక్ర, శని వారాల్లో నిర్వహించే పెన్‌డౌన్‌లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.