పంట కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్‌ బస్సు | - | Sakshi
Sakshi News home page

పంట కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్‌ బస్సు

Sep 19 2025 3:02 AM | Updated on Sep 19 2025 3:06 AM

పంట కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్‌ బస్సు 23న జిల్లా స్థాయి క్రీడా జట్ల ఎంపికలు యువతిని మోసగించిన దివ్యాంగునిపై కేసు

ఆగిరిపల్లి : డ్రైవర్‌కు ఫిట్స్‌ రావడంతో ప్రమాదవశాత్తూ ఓ ప్రైవేట్‌ స్కూల్‌ బస్‌ పంటబోదెలోకి దూసుకువెళ్లింది. అదృష్టవశాత్తూ బస్సులోని విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఆందరూ ఊపిరి పీల్చుకున్నారు. గురువారం ఉదయం ఈదర నుంచి విద్యార్థులను ఎక్కించుకుని ఆగిరిపల్లికి ఎస్‌ఎఫ్‌ఎస్‌ స్కూల్‌ బస్సు వస్తుంది. ఈదర అడ్డరోడ్డు వద్దకు వచ్చేసరికి డ్రైవర్‌కు అకస్మాత్తుగా ఫిట్స్‌ రావడంతో బస్సును అదుపు చేయలేకపోయాడు. దీంతో పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకుపోయింది. బస్సులో ప్రయాణిస్తున్న 35 మంది విద్యార్థులను గ్రామస్తులు బయటకు తీశారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సందర్భంగా ఎంఈఓ–1 హేబేలు మాట్లాడుతూ స్కూల్‌ బస్‌ ప్రమాదానికి గల కారణాలను విచారించి నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఈ నెల 23వ తేదీన ఏలూరు జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని యాజమాన్యాల ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అండర్‌ 14, అండర్‌ 17 బాల బాలికల విభాగాల్లో క్రీడా జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్టు స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ జిల్లా కార్యదర్శి కే అలివేలు మంగ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అండర్‌ జూడో, హ్యాండ్‌బాల్‌ జట్ల ఎంపిక పోటీలు స్థానిక ఇండోర్‌ స్టేడియంలో, బాస్కెట్‌బాల్‌ జట్ల ఎంపికలు కొవ్వలిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జరుగుతాయన్నారు. క్రీడాకారులు విధిగా జిల్లా స్థాయి ఎంట్రీ ఫారాలను తాము చదువుతున్న స్కూల్‌ / కాలేజ్‌ ప్రధానోపాధ్యాయులు లేదా ప్రిన్సిపాల్‌ సంతకాలతో అందజేయాలని, లేని పక్షంలో ఎంపిక పోటీల్లో పాల్గొనడానికి అనర్హులన్నారు. వివరాలకు 90308 94311 నెంబర్‌లో సంప్రదించాలన్నారు.

అత్తిలి: దివ్యాంగురాలిని పెళ్లిచేసుకుంటానని నమ్మించి మోసగించిన దివ్యాంగునిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అత్తిలికి చెందిన బడేటి మోహన్‌ మురళి అనే దివ్యాంగుడికి, ఓ దివ్యాంగురాలికి మధ్య పరిచయం ఏర్పడింది. సర్టిఫికెట్ల విషయంలో ఫిర్యాదికి అతడు సహాయం చేస్తూ ఉండేవాడు. అతడు తన అవసరాల నిమిత్తం అప్పుడప్పుడు ఆమెనుంచి దఫదఫాలుగా సుమారు రూ.2.50 లక్షలు తీసుకున్నాడు. ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి ఆమెను శారీరకంగా అనుభవించి అనంతరం ముఖం చాటేయడంతో దివ్యాంగురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి.ప్రేమరాజు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement