
పత్రికా స్వేచ్ఛను కాలరాయడమే..
జర్నలిస్టు భావ ప్రకటనా స్వేచ్ఛను అగణదొక్కడానికి కేసులు పెట్టడం దారుణం. ప్రజాస్వామ్యంలో ఫోర్ట్ ఎస్టేట్‌గా ఉన్న పత్రికా విలేకరులను భయభ్రాంతులకు గురిచేయడానికి ఫొటో జర్నలిస్టులపై సైతం కేసులు పెట్టడం దుర్మార్గం. ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకించకూడదనే జర్నలిస్టులపై కేసులు పెట్టేలా పోలీసులను ప్రోత్సహించడం బాధాకరం. పత్రికా రంగం విలువలు, జర్నలిస్టుల హక్కులను పరిరక్షించాలి.
–ఈద జాషువా, వైఎస్సార్‌సీపీ మేధావుల విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి, భీమవరం