
బీసీలకిచ్చిన హామీలు అమలు చేయాలి
భీమవరం: ఎన్నికల ముందు కూటమి నాయకులు బీసీ వర్గాలకు ఇచ్చిన వాగ్దానాలను తక్షణమే అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ డిమాండ్ చేశారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్‌లో ఐదు ప్రధాన డిమాండ్లను అమలు చేయాలని బీసీ సంఘం నాయకులు వినతిపత్రం సమర్పించారు. కాశీ మాట్లాడుతూ చట్టసభల్లో 33 శాతం, స్థానిక సంస్థలు–నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నా రు. అయితే వీటిని నెరవేర్చకపోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే తరుణంలో ఇప్పటికీ రాష్ట్రంలో కులగణన నిర్వహించకుండా, స్థానిక ప్రాదేశిక నియోజక వర్గాల విభజన పూర్తి చేయకుండా, బీసీలకు రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారని నిలదీశారు. ఏప్రిల్ తర్వాత ఆరు నెలల్లోపు ఎన్నికలు జరిగే అవకాశమున్నందున ఈలోపు కులగణన జరిపి ప్రా దేశిక నియోజక వర్గాల విభజన పూర్తి చేసి, బీసీల కు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డి మాండ్ చేశారు. బీసీ సబ్‌ప్లాన్ రూపొందించి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలన్నారు. జిల్లా నాయీబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు కొడవర్తి శివప్రసాద్, అగ్నికుల క్షత్రియ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు నాగిడిపాలెం శ్యామ్, కేశవభట్ల విజయ్, అత్తిలి బాబి, సుధీర్ పాల్గొన్నారు.