
ఉత్సాహంగా స్కూల్ గేమ్స్ ఎంపిక పోటీలు
భీమవరం : స్థానిక బ్రౌనింగ్ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో గురువారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా 69వ స్కూల్ గేమ్స్ అండర్ 19 బాల, బాలికల నెట్ బాల్, మాల్కంబ్ క్రీడల్లో ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అండర్–19 స్కూల్ గేమ్స్ సెక్రటరీ కె.జయరాజు మాట్లాడుతూ 100 మంది క్రీడాకారులు ఎంపికలో పాల్గొన్నారన్నారు. ఎంపికై న క్రీడాకారులు త్వరలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జట్లకు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. ఈ ఎంపిక కార్యక్రమానికి వీరవాసరం ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ నాగమణి, బ్రౌనింగ్ కళాశాల పీడీ దావుద్ ఖాన్, పీడీలు శ్రీనివాస్, జీపీసీ శేఖర్ రాజు తదితరులు సహకరించారు. అనంతరం ఎంపికై న క్రీడాకారులను బ్రౌనింగ్ కళాశాల చైర్మన్ మేడిది జాన్సన్, సెక్రటరీ మేడిది ఎస్తేరుప్రియాంక, అభినందించారు.
భీమవరం: జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం భీమవరం పట్టణంలోని ఆర్యవైశ్య యువజన భవనంలో అనసూయ చెస్ అకాడమీ ఇన్విటేషన్ చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మాదాసు కిషోర్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అండర్–7,9,11,13,13 విభాగాల్లో బాల, బాలికలకు నిర్వహించే పోటీల్లో మొదటి, రెండో స్థానంలో విజేతలకు రూ. 20 వేలు నగదు బహుమతులు అందజేయనున్నట్లు చెప్పారు. ఇతర వివరాల కోసం 90632 24466 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.